తెలంగాణ

telangana

ETV Bharat / sports

మాతృభూమిపై మమకారం చాటిన కోహ్లి - kohli smelled the indian soil

మాతృదేశంపై తమకున్న ప్రేమను విభిన్నంగా చాటుతున్నారు భారత క్రికెటర్లు. ఇటీవల బలిదాన్​ చిహ్నాన్ని గ్లౌజులపై ముద్రించుకుని ధోని దేశభక్తిని చాటితే... తాజాగా అదే కోవలోకి విరాట్​ కోహ్లీ చేరాడు.

భారత నేల కోహ్లీని కదిలిచెనిలా..

By

Published : Jun 10, 2019, 10:01 AM IST

బలిదాన్‌ చిహ్నాన్ని తన గౌజులపై ముద్రించి దేశంపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు టీమిండియా వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్ ధోని. మాతృదేశంపై తనకేమి తక్కువ ప్రేమ లేదంటున్నాడు కెప్టెన్‌ కోహ్లి. ఇటీవల విరాట్ ప్రపంచకప్​తో తిరిగిరావాలని తన చిన్ననాటి పాఠశాల సిబ్బంది... కోహ్లీ క్రికెట్ ఓనమాలు నేర్చుకున్న మైదానంలోని మట్టిని లండన్​కు పంపిన విషయం తెలిసిందే. అయితే ఆసీస్​తో మ్యాచ్​ సందర్భంగా ఓవల్​ మైదానంలోకి అడుగుపెట్టేముందు కోహ్లీ ఆ మట్టి వాసన చూసి బరిలోకి దిగాడు. మాతృభూమిపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. మ్యాచ్​ కోహ్లి చెలరేగి ఆడటం విశేషం.

మట్టి వాసన పీలుస్తున్న కోహ్లీ

దిల్లీలోని విశాల్‌ భారతి స్కూల్లో తొమ్మిదో గ్రేడ్‌ వరకు చదువుకున్నాడు కోహ్లీ. ఆ పాఠశాలలో చదువుతున్న రోజుల్లోనే 1998లో వెస్ట్‌ దిల్లీ క్రికెట్‌ అకాడమీలో చేరాడు. ఆ తర్వాత తన ప్రతిభతో 2008లో ఇండియన్‌ క్రికెట్‌ జట్టులో చేరాడు. క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. ఇప్పుడు అత్యుత్తమ బ్యాట్స్​మెన్​గా అవతరించాడు. ఈ క్రమంలో ప్రపంచకప్‌లో ఆసీస్‌తో మ్యాచ్‌కు ముందు తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు. ఆ పాఠశాల మట్టిని తెప్పించుకుని వాసన చూశాడు. ఆ సమయంలో ధోనీ, కోచ్‌ రవిశాస్త్రి కూడా అక్కడే ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details