తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయంపై టీమిండియా సారథి కోహ్లీ స్పందించాడు. "రాబోయే కాలంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నా.. రాయుడు నువ్వు ఉన్నతమైన వ్యక్తివి" అంటూ ట్విట్టర్‌లో పోస్టు చేశాడు.
ప్రపంచకప్ జట్టు ఎంపికలో మొదటి నుంచి స్థానం ఆశించిన రాయుడును కాదని జట్టు యాజమాన్యం విజయ్‌శంకర్‌ను ఎంపిక చేసింది. అనంతరం స్టాండ్‌బై ఆటగాడిగా ప్రకటించింది.
శిఖర్ ధావన్ గాయం కారణంగా ప్రపంచకప్ నుంచి తప్పుకోగా అతడికి బదులు రిషభ్‌పంత్‌ను ఎంపిక చేశారు సెలెక్టర్లు. అనంతరం విజయ్‌శంకర్ కూడా గాయం కారణంగా మెగాటోర్నీ నుంచి వైదొలగగా మయాంక్ అగర్వాల్‌కు చోటు కల్పించింది. ఈ విషయమై రాయుడు తీవ్ర మనస్తాపానికి గురై రిటైర్మెంట్ ప్రకటించాడని తెలుస్తోంది. అయితే సెలెక్టర్లు అతడిని ఎంపిక చేయకపోవడం వెనుక రాయుడు చేసిన ట్వీటే కారణమని అంతా భావిస్తున్నారు.
ప్రపంచకప్ జట్టును ఎంపిక చేసినప్పుడు తనని కాదని విజయ్‌శంకర్‌ని ఎంపిక చేయడం పట్ల రాయుడు చేసిన ట్వీట్ వివాదాస్పదం అయింది. భారత జట్టు చీఫ్ సెలెక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్.. విజయ్ శంకర్ త్రీడీ ఆటగాడని అందుకే అతడిని ఎంపికి చేశామని వివరణ ఇవ్వగా.. అందుకు బదులుగా రాయుడు.. "ప్రపంచకప్ చూడటానికి త్రీడీ కళ్లజోడు ఆర్డర్ చేశాను" అంటూ ట్వీట్ చేశాడు.