తెలంగాణ

telangana

ETV Bharat / sports

"45 రోజుల కష్టం 45 నిమిషాల్లో చేజారింది" - ind

45 రోజుల కష్టం 45 నిమిషాల తప్పిదం వల్ల వృథా అయిందని భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ తెలిపాడు. కివీస్ బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారని కితాబిచ్చాడు. జడేజా బ్యాటింగ్​తో ఆకట్టుకున్నాడని చెప్పాడు కోహ్లీ.

విరాట్ కోహ్లీ

By

Published : Jul 10, 2019, 9:24 PM IST

Updated : Jul 10, 2019, 11:25 PM IST

సెమీస్​ మ్యాచ్​లో న్యూజిలాండ్ చేతిలో పరజాయం చెంది ప్రపంచకప్​ నుంచి నిష్క్రమించింది భారత్​. మ్యాచ్​ అనంతరం ఈ ఓటమిపై స్పందించాడు కెప్టెన్ విరాట్ కోహ్లీ. 45 రోజుల శ్రమ 45 నిమిషాల్లో చేసిన తప్పిదం వల్ల వృథా అయిందని తెలిపాడు. కివీస్ బౌలర్లు అద్భుతంగా రాణించారని ప్రశంసించాడు.

"240 పరుగుల స్కోరు ఏ మైదానంలోనైన ఛేదించ గల లక్ష్యమే. ఆత్మవిశ్వాసంతోనే బరిలోకి దిగాం. అయితే కివీస్ బౌలర్లు కొత్త బంతితో చక్కగా స్వింగ్ చేసి వికెట్ల తీశారు. 45 రోజుల శ్రమ 45 నిమిషాల్లో చేసిన తప్పిదం వల్ల వృథా అయింది. ఈ ఓటమిని అంగీకరించడం కొంచెం కష్టమే" - విరాట్ కోహ్లీ భారత్ కెప్టెన్.

జడేజా అద్భుతంగా ఆడాడని తెలిపాడు కోహ్లీ. ధోనితో కలిసి మంచి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడని చెప్పాడు. మహీ రనౌట్​ కాకుంటే ఫలితం వేరేలా ఉండేదేమోనని అభిప్రాయపడ్డాడు విరాట్.

న్యూజిలాండ్​తో జరిగిన సెమీస్ మ్యాచ్​లో భారత్​ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ పరాజయంతో ప్రపంచకప్​ నుంచి నిష్క్రమించింది టీమిండియా.

ఇది చదవండి: జడేజా, ధోనీ వీరోచిత ఇన్నింగ్స్​ వృథా... ఫైనల్లో కివీస్​

Last Updated : Jul 10, 2019, 11:25 PM IST

ABOUT THE AUTHOR

...view details