విరాట్ కోహ్లీ ఫిట్‌గా ఉన్నాడని, సౌతాంప్టన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి మ్యాచ్‌కు అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. అనంతరం ట్రైనింగ్ సెషన్లోనూ పాల్గొన్నాడని, ఈ అంశంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని చెప్పాయి.
శనివారం నెట్స్‌లో ప్రాక్టీస్ చేస్తున్న కోహ్లీ బొటన వేలుకు గాయమైంది. అనంతరం ఫీజియో వచ్చి విరాట్ వేలిపై స్పే చేసి ప్రథమచికిత్స అందించాడు. విరాట్ గాయం విషయం తెలిసిన అభిమానులు ఆందోళనకు గురయ్యారు.