తెలంగాణ

telangana

ETV Bharat / sports

మందలించి.. మనసు గెలిచిన విరాట్ - స్టీవ్​ స్మిత్​కు చప్పట్లు కొట్టమన్న విరాట్​ కోహ్లీ

విరాట్​ కోహ్లీ... ప్రపంచ క్రికెట్​లో అత్యుత్తమ బ్యాట్స్​మెన్​ మాత్రమే కాదు... ఆటగాళ్లతో మంచి స్నేహపూర్వక సంబంధం కలిగి ఉంటాడు. మైదానంలో భావోద్వేగాలతోనూ ఆకట్టుకుంటాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్​ సమయంలో అభిమానులకు కోహ్లీ చేసిన ఓ సూచన అతడిపై ప్రశంసలు కురిపిస్తోంది.

ఆసీస్​ ఆటగాడికి చప్పట్లు కొట్టమన్న విరాట్​ కోహ్లీ

By

Published : Jun 10, 2019, 11:30 AM IST

మైదానంలో ఆటగాళ్లు వికెట్​ తీసినా, మంచి ప్రదర్శన చేసినా, చక్కటి ఇన్నింగ్స్​ ఆడినా సహచరులు మెచ్చుకుంటారు. అభిమానులైతే నచ్చిన బ్యాట్స్​మెన్​, బౌలర్ రాణించినపుడు కేరింతలు కొడతారు. ఆదివారం ఓవల్​ వేదికగా భారత్​-ఆస్ట్రేలియా మ్యాచ్​లో మాత్రం​ స్టేడియం మొత్తం టీమిండియా ఫ్యాన్స్​తో నిండిపోయింది. ఆసీస్​కు మద్దతిచ్చేవారే కరవయ్యారు. అయితే విరాట్​ కోహ్లీ బ్యాటింగ్​ ఆడుతున్న సమయంలో ఆస్ట్రేలియా ఆటగాడు స్టీవ్​ స్మిత్​ అద్భుత ఫీల్డింగ్​తో అదరగొట్టాడు.

బాల్​ టాంపరింగ్ ఉదంతంతో ఏడాది నిషేధం ఎదుర్కొని బరిలోకి దిగిన స్మిత్​ను కొంత మంది భారత అభిమానులు 'మోసగాడు' అంటూ కించపరిచేలా నినాదాలు చేశారు. ఇది గమనించిన కోహ్లి ఓవర్​ మధ్యలో ఆ అభిమానుల వైపు చూస్తూ.. స్మిత్​ను విమర్శించడం మాని అభినందించండి అంటూ సంకేతమించాడు. ఆ తర్వాత నినాదాలు ఆగిపోయాయి. ఇది గమనించిన స్మిత్ అభినందనపూర్వకంగా విరాట్​తో చేయి కలిపాడు. ఈ వీడియో నెట్టింట్లో విపరీతంగా ఆకట్టుకుంటోంది. విరాట్​ మంచి ఆటగాడు మాత్రమే కాదు స్ఫూర్తినిచ్చే క్రికెటర్​గా మరోసారి నిరూపించుకున్నాడని ఫ్యాన్స్​ కొనియాడుతున్నారు.

ఇవీ చూడండి:
WC19: ఆసీస్​పై భారత్​ అద్భుత విజయం

ABOUT THE AUTHOR

...view details