తెలంగాణ

telangana

ETV Bharat / sports

"రిటైర్మెంట్​పై మాతో ఏం చెప్పలేదు" - semis

ప్రణాళికలో భాగంగానే మహీ ముందు బ్యాటింగ్​కు రాలేదని విరాట్ కోహ్లీ చెప్పాడు. రిటైర్మెంట్ విషయంపై జట్టుతో ఏం చర్చించలేదని అన్నాడు.

కోహ్లీ

By

Published : Jul 11, 2019, 12:27 PM IST

ప్రపంచకప్ అనంతరం ధోనీ రిటైర్మెంట్ ప్రకటిస్తాడని చాలా రోజులుగా వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే ఈ నిర్ణయంపై జట్టుతో మహీ చర్చించలేదని విరాట్ కోహ్లీ అన్నాడు. సెమీస్​ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కోహ్లీ అనుకున్న ప్లాన్ ప్రకారమే ధోని ఏడో స్థానంలో బ్యాటింగ్​కొచ్చాడని తెలిపాడు.

"రిటైర్మెంట్ గురించి ధోనీ.. జట్టుతో చర్చించలేదు. ఈ అంశంపై ఏం చెప్పలేదు. - విరాట్ కోహ్లీ

బ్యాటింగ్ ఆర్డర్​లో మహీ ముందు ఎందుకు రాలేదు అనే ప్రశ్నపై బదులిస్తూ.. ప్రణాళిక ప్రకారమే ధోనీని ఏడో స్థానంలో పంపామని చెప్పాడు.

"ఓ ఎండ్​లో ఉండి పరిస్థితులను నియంత్రిస్తూ ప్రణాళిక బద్దంగా నడిపించే బాధ్యతను తీసుకున్నాడు. అదే ప్లాన్​ను ఇక్కడ ఆచరించాం. ఒకవేళ చివరి 7, 8 ఓవర్లలో ఆడాల్సి ఉంటే మహీ ముందు బ్యాటింగ్​కు వచ్చేవాడు" - విరాట్ కోహ్లీ

ఈ మ్యాచ్​లో మహేంద్ర సింగ్ ధోనీ 72 బంతుల్లో 50 పరుగులతో ఆకట్టుకున్నాడు. కివీస్​తో జరిగిన ఈ మ్యాచ్​లో భారత్ 18 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.

ABOUT THE AUTHOR

...view details