తెలంగాణ

telangana

ETV Bharat / sports

'నోట్ల రద్దు తర్వాత భారత్​ విఫల ప్రయోగం ఇదే' - worldcup

ఈ ప్రపంచకప్​లో విజయ్​శంకర్ ప్రదర్శనపై నెటిజన్లు అతడికి వ్యతిరేకంగా వ్యంగ్యంగా పోస్టులు పెడుతున్నారు. నోట్ల రద్దు తర్వాత భారత్​ చేసిన విఫల ప్రయోగం విజయ్​శంకర్​కు అవకాశమివ్వడం అంటూ ట్వీట్ చేశారు.

విజయ్ శంకర్

By

Published : Jun 28, 2019, 7:17 AM IST

Updated : Jun 28, 2019, 1:25 PM IST

"విజయ్ శంకర్ త్రీడీ ప్లేయర్​.. కోహ్లీ, బుమ్రా, ధోనీ ముగ్గురు లక్షణాలు ఉన్నాయి. కాకపోతే కోహ్లీ బౌలింగ్ చేసినట్టు, బుమ్రా బ్యాటింగ్ చేసినట్టు, తనకు తాను ధోనీ అనుకుంటున్నట్టు ఉంది" అంటూ విజయ్​శంకర్​పై విభిన్నంగా స్పందిస్తున్నారు నెటిజన్లు. ఈ ప్రపంచకప్​లో అతడి ప్రదర్శనపై విసుగు చెందిన ఫ్యాన్స్​ వినూత్న పోస్టులు పెడుతున్నారు.

"నోట్ల రద్దు తర్వాత.. భారత్​ చేసిన విఫల ప్రయోగం విజయ్​శంకర్​కు అవకాశమివ్వడం" అంటూ ఒకరు ట్వీట్ చేశారు. "దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్​కు అవకాశమిస్తే వారు విజయ్​ కంటే బాగా ఆడతారు" అని ఇంకొకరు స్పందించారు.

ఈ ప్రపంచకప్​లో మూడు మ్యాచ్​లాడిన విజయ్ శంకర్ పాకిస్థాన్​పై తొలి బంతికే వికెట్​ తీయడం మిహా చెప్పుకోదగ్గ ప్రదర్శనేమీ చేయలేదు. పాక్​తో పోరులో ఇన్నింగ్స్​ చివర్లో వచ్చి 15 బంతుల్లో15 పరుగుల చేసి విసుగు తెప్పించాడు. అఫ్గాన్​తో మ్యాచ్​లో 41 బంతుల్లో 29 పరుగులు చేశాడు. విండీస్​తో మ్యాచ్​లో 19 బంతుల్లో 14 పరుగుల చేసి మరోసారి విఫలమయ్యాడు.

ప్రపంచకప్​ ముందు నాలుగోస్థానంపై తీవ్ర సందిగ్ధత నెలకొంది. ఆ స్థానంలో రాహుల్ నిలకడగా రాణించడంతో సమస్య తీరందనుకున్నారు. అయితే గాయం కారణంగా శిఖర్ ధావన్​ ప్రపంచకప్​ నుంచి వైదొలిగిన తర్వాత ఒపెనర్​గా రాహుల్ వస్తున్నాడు. దీంతో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న విజయ్​ ఏ మాత్రం ఆకట్టుకోవట్లేదు. దినేశ్ కార్తీక్, రిషభ్ పంత్ అందుబాటులో ఉన్నా.. జట్టు మేనేజ్​మెంట్ విజయ్​కే అవకాశమిస్తోంది.

Last Updated : Jun 28, 2019, 1:25 PM IST

ABOUT THE AUTHOR

...view details