ప్రపంచకప్‌లో భారత జట్టుకు మరో ఎదురు దెబ్బ. గాయం కారణంగా శిఖర్ ధావన్ ప్రపంచకప్‌కు దూరమైన సంగతి మరువకముందే మరో టీమిండియా ఆటగాడు వరల్డ్‌కప్ నుంచి నిష్క్రమించాడు. కాలి బొటన వేలు గాయం కారణంగా విజయ్‌శంకర్ మెగాటోర్నీకి దూరమయ్యాడు.
నెట్ ప్రాక్టీస్‌లో బుమ్రా బౌలింగ్‌లో గాయపడిన విజయ్.. ఇంగ్లాండ్ మ్యాచ్‌కు దూరమయ్యాడు. అనంతరం అతడిని పరీక్షించిన వైద్యులు విశ్రాంతి అవసరమని తేల్చారు. దీంతో మొత్తం ప్రపంచకప్‌కు విజయ్ శంకర్ దూరమవ్వనున్నాడని బీసీసీఐ ప్రకటించింది. విజయ్ స్థానంలో మయాంక్ అగర్వాల్‌కు జట్టులో చోటు దక్కే అవకాశముంది.