కార్డిఫ్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఇంగ్లాండ్ 386 పరుగుల భారీ స్కోరు చేసింది. ఈ మ్యాచ్‌లో జేసన్ రాయ్(153) శతకంతో ఆకట్టుకున్నాడు. అయితే రాయ్ సెంచరీ చేసే క్రమంలో అంపైర్‌ను ఢీ కొట్టాడు. ఆ దృశ్యాన్ని చూసిన వీక్షకులు కాసేపు నవ్వుకున్నారు.
WC19: అంపైర్‌ను ఢీ కొట్టిన రాయ్ - england
పరుగుకోసం ప్రయత్నిస్తూ అంపైర్‌ను ఢీ కొట్టాడు జేసన్ రాయ్. బంతిని చూస్తూ నాన్ స్ట్రైకింగ్ ఎండ్ వద్ద ఉన్న అంపైర్‌ను తగిలాడు. దీంతో అంపైర్ అమాంతం కిందపడిపోయాడు.
ముస్తాఫిజుర్ వేసిన 27వ ఓవర్ ఐదో బంతిని లెగ్ సైడ్ దిశగా ఆడాడు రాయ్. బంతిని చూస్తు నాన్ స్ట్రైకింగ్ ఎండ్‌లోకి వస్తున్న రాయ్.. అంపైర్ జోయల్ విల్సన్‌ను ఢీ కొట్టాడు. ఆ సమయంలో అంపైర్ కూడా బంతినే చూస్తుండటం వల్ల రాయ్‌ను గమనించలేదు. ఈ దృశ్యాన్ని చూసినవారు నవ్వుకున్నారు. అది రాయ్ సెంచరీ పరుగు.
ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ విజృంభించారు. రాయ్ శతకంతో పాటు బట్లర్(64), బెయిర్ స్టో(64) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు అత్యధిక ఇన్నింగ్ స్కోరు నమోదు చేసింది ఇంగ్లాండ్.