క్రికెట్లోని వికెట్ల మధ్య భాగాన్ని పిచ్ అంటారు. వికెట్ల నుంచి ఐదు అడుగుల దూరం, రెండు అడుగుల వెడల్పుగా ఉన్న ప్రాంతాన్ని డేంజర్ ఏరియా లేదా ప్రొటెక్టెడ్ ఏరియాగా పిలుస్తారు. ఐసీసీ క్రికెట్ నిబంధనల ప్రకారం బౌలర్ బంతి వేశాక ఆ ప్రాంతంలో నడవకూడదు, పరిగెత్తకూడదు.
ఆట సమయంలో బ్యాట్స్‌మెన్ లేదా బౌలర్ పిచ్‌పై నడవకూడదు. ఎందుకంటే బంతి సాధారణంగా పిచ్‌పైనే బౌన్స్ అవుతుంది. ఒకవేళ ఈ పిచ్‌ను బౌలర్ తన కాలి అడుగులతో తొక్కితే ఆ అడుగుల్లో పడిన బంతి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెడుతుంది. సమాంతరంగా ఉండాల్సిన పిచ్ బౌలర్‌కు ఎక్కువగా సహకరిస్తుంది. ఫలితంగా మ్యాచ్‌లో పారదర్శకత లోపిస్తుంది. ఈ అవకాశంతో బౌలర్లు మ్యాచ్‌ను మార్చేసే అవకాశం ఉంది.