కరోనా సంక్షోభంలోనూ ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)ను కొనసాగిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ఓ ప్రకటనలో పేర్కొంది. ఈ నేపథ్యంలో పలువురు ఆటగాళ్లు క్రికెట్ ఆడేందుకు విముఖత చూపుతున్నారు. ఇప్పటికే టీమ్ఇండియా స్పిన్నర్ అశ్విన్‌తో పాటు ముగ్గురు ఆస్ట్రేలియా ఆటగాళ్లు టోర్నీ నుంచి నిష్క్రమించారు. అయితే టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి భారత్‌లో ఇదే పరిస్థితి కొనసాగితే.. టోర్నీ వేదికను మార్చే అవకాశం ఉందని వాదనలు వినిపిస్తున్నాయి.
టీ20-ప్రపంచకప్ భారత్‌లో జరిగేనా?
భారత్‌లో విపరీతంగా పెరుగుతోన్న కరోనా కేసులు కారణంగా అక్టోబరులో జరగనున్న టీ20 ప్రపంచకప్ నిర్వహణపై నీలినీడలు కమ్ముకున్నాయి. వైరస్ విజృంభణ కారణంగా టీ20 ప్రపంచకప్ నిర్వహించడం కష్టమనే కొందరు క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యామ్నాయ వేదిక గురించి చర్చ జరుగుతోంది.
భారత్‌లో టీ20 ప్రపంచకప్ నిర్వహణ డౌటే!
క్రికెటర్లు, ఇతర సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని.. అక్టోబరు నాటికి భారత్‌లో కరోనా కేసులు నియంత్రణలో రాకపోతే టీ20 ప్రపంచకప్‌ను యూఏఈలో నిర్వహించే వేదికగా ఎంపికచేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ టోర్నీ తరలించాల్సి వస్తే బీసీసీఐ మొదటి ఎంపిక యూఏఈ అవుతుందని పలువురు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చూడండి..'వచ్చే వారంలో క్రికెటర్లకు వాక్సిన్!'