తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: ఇంగ్లాండ్​పై బంగ్లా హ్యాట్రిక్​ సాధించేనా..?

ప్రపంచకప్​లో తమ ఆరంభ మ్యాచ్​లోనే రికార్డు స్కోరు సాధించిన బంగ్లాదేశ్​ నేడు బలమైన ప్రత్యర్థి ఇంగ్లాండ్​తో తలపడనుంది. గత మ్యాచ్​లలో ఓటమి పాలైన ఇరుజట్లు కార్డిఫ్​ వేదికగా సత్తా చాటాలని చూస్తున్నాయి.   ఇంగ్లాండ్​ మాదిరిగానే 300 పరుగుల పైచిలుకు స్కోరు చేసిన బంగ్లా గట్టి పోటీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు మ్యాచ్​ ప్రసారం కానుంది.

ప్రపంచకప్​లో నేడు: ఇంగ్లాండ్​పై బంగ్లా హ్యాట్రిక్​ సాధించేనా..?

By

Published : Jun 8, 2019, 7:02 AM IST

Updated : Jun 8, 2019, 9:47 AM IST

ఇంగ్లాండ్​పై బంగ్లా హ్యాట్రిక్​ సాధించేనా..?
మెగాటోర్నీలో ఎన్నో పెద్ద జట్లకు షాకిచ్చిన బంగ్లాదేశ్​ నేడు ఆతిథ్య ఇంగ్లాండ్​తో పోరుకు సిద్ధమవుతోంది. కార్డిఫ్​ వేదికగా జరగనున్న ఈ మ్యాచ్​లో విజయం సాధించాలని ఇరుజట్లు ఆరాటపడుతున్నాయి. ఇప్పటివరకు ప్రదర్శనలో సమఉజ్జీలుగా ఉన్న బంగ్లా-ఇంగ్లాండ్​లలో ఎవరు గెలుస్తారో చూడాల్సిందే. గత మ్యాచ్​లలో రెండు జట్ల ప్రదర్శన ఓసారి పరిశీలిద్దాం.

ఇంగ్లాండ్​ (బలాలు-బలహీనతలు):

ఆతిథ్య ఇంగ్లాండ్​ టైటిల్​ ఫేవరెట్​గా బరిలోకి దిగింది. టోర్నీ ఆరంభ మ్యాచ్​లోనే దక్షిణాఫ్రికాపై 104 పరుగుల తేడాతో భారీ విజయం సొంతం చేసుకుంది. ఆ మ్యాచ్​లో సఫారీల బౌలింగ్​ను తుత్తునియలు చేస్తూ నలుగురు ఆటగాళ్లు అర్ధశతకాలతో చెలరేగిపోయారు. 312 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికాను పదునైన పేస్​ లైనప్​తో అడ్డుకుంది మోర్గాన్​ సేన​.

రెండో మ్యాచ్​లో పాకిస్థాన్​ నిర్దేశించిన 349 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే ప్రయత్నం చేసినా... గెలుపు అంచుల వరకు వచ్చి కుప్పకూలింది. ఫలితంగా 14 పరుగుల తేడాతో విజయం పాక్​ సొంతమైంది.

రెండు మ్యాచుల్లోనూ 300 పైగా పరుగులు చేసి ఈ ఏడాది ప్రపంచకప్​లో భారీ స్కోర్లు చేయగలిగే సత్తా ఉన్న జట్టుగా పేరు తెచ్చుకుంది.

  1. రాయ్​, రూట్​, బట్లర్​, మోర్గాన్​తో ఆతిథ్య జట్టు బ్యాటింగ్​ లైనప్​ బలంగా ఉంది. బౌలింగ్​లో జోఫ్రా ఆర్చర్​, ఆల్​రౌండర్​గా స్టోక్స్​ రాణిస్తున్నారు.
  2. బ్యాటింగ్​లో బలంగా ఉన్నా స్పిన్​ ఆడటంలో విఫలమవుతోంది ఇంగ్లాండ్​. బలమైన పేస్​ బౌలింగ్​తో రాణిస్తున్నా మధ్య ఓవర్లలో పరుగులు సమర్పించుకుంటున్నారు ఫాస్ట్​ బౌలర్లు.

బంగ్లాదేశ్ (బలాలు-బలహీనతలు)​:

తన తొలి ప్రపంచకప్​ మ్యాచ్​లో 330 పరుగుల భారీ స్కోరు చేసింది బంగ్లాదేశ్​. అదీ దక్షిణాఫ్రికా లాంటి బలమైన జట్టుపై. ఫలితంగా.. 21 పరుగుల తేడాతో విజయం సాధించి ఖాతా తెరిచింది. సమష్టిగా రాణిస్తే పెద్ద జట్లనైనా ఓడించగలమనే ఆత్మస్థైర్యంతో బంగ్లా ఆటగాళ్లు ఉన్నారు.

న్యూజిలాండ్​తో మ్యాచ్​లోనూ 244 పరుగులే చేసినా కివీస్​ ఆటగాళ్లకు చుక్కలు చూపించారు. బంగ్లా అద్భుతమైన బౌలింగ్​తో 47వ ఓవర్​ వరకు పట్టు విడవకుండా ప్రయత్నించారు. చివరికి 2 వికెట్ల తేడాతో న్యూజిలాండ్​ గెలిచినా బంగ్లా తనదైన ఆటతీరుతో ఆకట్టుకుంది. పేస్​ ఆడటంలో కాస్త ఇబ్బంది పడుతున్న ఈ జట్టు... బౌలింగ్​ పటిష్ఠంగా ఉండటంతో తక్కువ స్కోరు చేసినా పోటీ ఇవ్వగలుగుతోంది.

  1. ముష్ఫికర్ రహీమ్​, సౌమ్య సర్కార్​,మహ్మదుల్లా బ్యాటింగ్​లో రాణిస్తున్నారు. షకిబుల్​ హసన్​ ఆల్​రౌండర్​గా, ముస్తాఫిజుర్​ రహ్మన్​, సైఫుద్ధీన్​ బౌలింగ్​లో సత్తా చాటుతున్నారు.
  2. బంగ్లాకు స్పిన్ ప్రధానాయుధం కాగా బ్యాట్స్​మెన్లలో నిలకడలేమి ప్రతికూలాంశం.
  • రెండు జట్లు రెండేసి మ్యాచ్​లు ఆడి ఒక్కో విజయాన్ని ఖాతాలో వేసుకున్నాయి. ఈ ప్రపంచకప్​లో ఇరు జట్లు చివరగా తమ తమ మ్యాచ్​ల్లో ఓడిపోయాయి.
  • పాయింట్ల పట్టికలో రెండేసి పాయింట్లే ఉన్నా నెట్​ రన్​రేట్​ కాస్త మెరుగ్గా ఉన్న కారణంతో ఇంగ్లండ్​ ముందంజలో ఉంది. ఇప్పటివరకు రెండు జట్లు మూడుసార్లు ప్రపంచకప్​లో తలపడగా బంగ్లా రెండు, ఇంగ్లాండ్​ ఒక మ్యాచ్​లోనూ నెగ్గాయి.

జట్లు అంచనా...

ఇంగ్లాండ్​:జాసన్​ రాయ్​, జానీ బెయిర్​ స్టో, జోయ్​ రూట్​, ఇయాన్​ మోర్గాన్​(కెప్టెన్​), బెన్​ స్టోక్స్​, జాస్​ బట్లర్​(కీపర్​), మొయిన్​ అలీ, క్రిస్​ వోక్స్​, జోఫ్రా ఆర్చర్​, మార్క్​ ఉడ్​, లిమ్​ ప్లంకెట్​

( ఆదిల్​ రషీద్​, టామ్​ కరన్​, జేమ్స్​ విన్సీ, లియామ్​ డాసన్​)

బంగ్లాదేశ్​: తమీమ్​ ఇక్బాల్​, సౌమ్య సర్కార్​, షకిబుల్​ హసన్​, ముష్ఫికర్​ రహీమ్​(కీపర్​), మహ్మద్​ మిథున్​, మహ్మదుల్లా, హుస్సేన్​, మహ్మద్​ సైఫుద్ధీన్​, మెహిదీ హసన్​, మష్రఫా​ మొర్తజా(సారథి), ముస్తాఫిజుర్​ రహ్మన్​,

(లిటన్​ దాస్​, సబ్బీర్​ రహ్మాన్​, రూబెల్​ హొస్సేన్​, అబు జాయెద్​)

Last Updated : Jun 8, 2019, 9:47 AM IST

ABOUT THE AUTHOR

...view details