బ్యాటింగ్‌తో ఆకట్టుకున్న మాస్టర్ బ్లాస్టర్ సచిన్తెందూల్కర్ తన గొంతు సవరించుకోనున్నాడు. ప్రపంచకప్‌లో ఈ రోజు తలపడబోతున్న ఇంగ్లాండ్ - దక్షిణాఫ్రికా ఆరంభ మ్యాచ్‌లో వ్యాఖ్యాతగా మారనున్నాడు. కామెంటేటర్‌గా సచిన్కిదే తొలి మ్యాచ్.
మ్యాచ్ ముందు నిర్వహించే 'సచిన్ ఓపెన్ ఎగైన్' కార్యక్రమంలో పాల్గొననున్నాడు మాస్టర్. సంబంధిత ప్యానెల్ సభ్యులతో కలవనున్నాడు. ఈ రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రీ షో ప్రారంభంకానుంది.
ఆరు ప్రపంచకప్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తెందూల్కర్ మెగాటోర్నీల్లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2003 వరల్డ్‌కప్‌లో 673 పరుగులు చేసి ఆ సీజన్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ అవార్డు దక్కించుకున్నాడు.
ఈ ప్రపంచకప్‌లో జూన్ 5న దక్షిణాఫ్రికాతో తన తొలి మ్యాచ్ ఆడనుంది టీమిండియా. జులై 14న తుదిపోరు జరగనుంది. 12వ ప్రపంచకప్ సీజన్లో 46 రోజులపాటు 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో 10 జట్లు పాల్గొననున్నాయి.
ఇది చదవండి : WC19: భారత కెప్టెన్ విరాట్ కోహ్లీకి అరుదైన గౌరవం