ప్రపంచకప్ ముగిసింది. ఇంగ్లాండ్ జట్టు విజేతగా నిలవగా.. న్యూజిలాండ్ రన్నరప్ కైవసం చేసుకుంది. ఈ టోర్నీలో పలువురు ఆటగాళ్లు ఆకట్టుకోగా.. మరికొందరు భారీ అంచనాల మధ్య విఫలమయ్యారు. వీరి ప్రదర్శను బట్టి ఐసీసీ 12 మందితో ఓ జట్టును ప్రకటించింది. తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ కూడా ఓ జట్టును ప్రకటించాడు. ఇందులో భారత్ నుంచి ఐదుగురికి చోటు లభించింది.
ఐసీసీ ప్రపంచకప్ జట్టుకు సారథిగా ఎంపికైన విలియమ్సన్‌ను సచిన్ కెప్టెన్‌గా ఎంచుకున్నాడు. టీమిండియా వికెట్ కీపర్ ధోనీని కాదని ఇంగ్లాండ్ కీపర్ బెయిర్ స్టోకు వికెట్ల వెనుక బాధ్యతలను అప్పగించాడు.
ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు సాధించిన రోహిత్ శర్మతో పాటు భారత్ నుంచి కోహ్లీ, బుమ్రా, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజాకు సచిన్ జట్టులో చోటు దక్కింది. ఆల్‌రౌండర్ల విభాగంలో బెన్‌స్టోక్స్, షకిబుల్ హసన్, పాండ్య, రవీంద్ర జడేజాలకు స్థానం లభించింది.