ఇంగ్లండ్‌లోని వేల్స్లో జరగనున్న ప్రపంచకప్ మ్యాచ్‌కు అప్పుడే సాధన ప్రారంభించింది టీమిండియా. ఆ దేశంలో అడుగుపెట్టిన మరుసటి రోజైన గురువారం నుంచే ఆటగాళ్లు ఓవల్ మైదానంలో నెట్స్‌లో సాధన ప్రారంభించారు. ఈ టోర్నీలో భారత్‌తో పాటు డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియా, ఆతిథ్య ఇంగ్లాండ్ టైటిల్ ఫేవరెట్లుగా బరిలోకి దిగుతున్నాయి. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సహా జట్టు ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశారు. కోహ్లీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియోను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకుంది.
ఇంగ్లండ్ గడ్డపై టీమిండియా ప్రాక్టీస్ షురూ... - ప్రపంచకప్
మే 30న ప్రారంభంకానున్న ప్రపంచకప్ మెగా టోర్నీ కోసం బుధవారమే ఇంగ్లండ్‌లో అడుగుపెట్టిన భారత జట్టు... తాజాగా ఈ రోజు ఓవల్ మైదానంలో నెట్స్‌లో సాధన చేస్తూ కనిపించింది.
అనంతరం పది జట్ల కెప్టెన్లు కలిసి ఒకే వేదికపై ముచ్చటించారు. ఈ చిట్‌చాట్‌ను ఫేస్బుక్ లైవ్‌లో ప్రసారం చేసింది ఐసీసీ.
ఇప్పటికే నాలుగుసార్లు ప్రపంచకప్ టోర్నీకి వేదికైన ఇంగ్లండ్ 20 ఏళ్ల తర్వాత ఐదోసారి మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తోంది. అయితే ఇంగ్లండ్ గడ్డపై మంచి రికార్డు ఉండటం భారత్‌కు కలిసొచ్చే అంశం. మెగాటోర్నీలో భాగంగా తొలి మ్యాచ్‌లోటీమిండియా జూన్ 5న దక్షిణాఫ్రికాతో తలపడనుంది. అంతకంటే ముందు మే 25న న్యూజిలాండ్, మే 28న బంగ్లాదేశ్‌తో ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడనుంది.