తెలంగాణ

telangana

ETV Bharat / sports

బెన్​ స్టోక్స్​కు 'న్యూజిలాండర్​ ఆఫ్​ ది ఇయర్'​ పురస్కారం

'న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్' పురస్కారానికి  ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్​ పేరును ప్రతిపాదించారు. అతడి స్వస్థలం న్యూజిలాండ్​ కావడమే ఇందుకు కారణం. కివీస్​ కెప్టెన్ కేన్ విలియమ్సన్ ఈ జాబితాలో ఉన్నాడు.

ఇంగ్లాండ్​ క్రికెటర్​కు కివీస్ పురస్కారం..!

By

Published : Jul 19, 2019, 12:51 PM IST

ప్రపంచకప్​ ఫైనల్​లో న్యూజిలాండ్​పై అద్భుత విజయం సాధించిన ఇంగ్లాండ్​.. తొలిసారి కప్​ను సొంతం చేసుకుంది. ఈ గెలుపునకు కారణమైన స్టోక్స్​ను అందరూ ప్రశంసిస్తున్నారు. ఇప్పుడు మరో ఘనత అతడ్ని వరించే అవకాశముంది. 'న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్​' పురస్కారానికి స్టోక్స్​ పేరును నామినేట్ చేశారు. కివీస్​ కెప్టెన్ విలియమ్సన్ ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు.

బెన్​ స్టోక్స్​ స్వస్థలం న్యూజిలాండ్​లోని క్రైస్ట్​చర్చ్​. కానీ 12 ఏళ్ల వయసులోనే ఇంగ్లాండ్​ వలస వెళ్లాడు. ఆ తర్వాత జట్టులో ప్రధాన క్రికెటర్​గా మారాడు. ఇటీవలే జరిగిన ప్రపంచకప్​లో ఇంగ్లీష్ జట్టు తరఫున అద్భుతంగా రాణించి, కప్​ కొట్టడంలో తన మార్క్ చూపించాడు. టోర్నీ మొత్తంలో 465 పరుగులు చేసి 7 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్​లో 84 పరుగులతో ఇంగ్లాండ్​ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఇంగ్లాండ్ క్రికెటర్ బెన్ స్టోక్స్

'న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్​ అవార్డ్స్'కు చీఫ్ జడ్జ్​గా వ్యవహరించిన కామెరాన్ బెన్నెట్.. స్టోక్స్​ నామినేషన్​పై స్పందించారు.

"అతడు కివీస్​ తరఫున ఆడకపోవచ్చు. కానీ పుట్టింది న్యూజిలాండ్​ క్రైస్ట్​చర్చ్​లోనే. స్టోక్స్​ తల్లిదండ్రులు ఇప్పటికీ ఇక్కడే నివసిస్తున్నారు." -కామెరాన్ బెన్నెట్, అవార్డ్స్​ చీఫ్ జడ్జ్

ప్రపంచకప్​లో కివీస్ కెప్టెన్​గా అత్యుత్తమ ప్రదర్శన చేసిన విలియమ్సన్.. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్​గా నిలిచాడు. ఇప్పుడు ఈ అవార్డ్స్​కు సంబంధించి పలు నామినేషన్లు పొందాడు.

ఈ పురస్కారం కోసం మొత్తం 10 మంది పేర్లను ఈ ఏడాది డిసెంబరులో చెప్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే గాలా అవార్డ్స్ కార్యక్రమంలో 'న్యూజిలాండర్ ఆఫ్ ది ఇయర్' విజేత ఎవరో ప్రకటిస్తారు.

ఇది చదవండి: WC19: ప్రపంచకప్​లో 'బెన్​ స్టోక్స్​' సూపర్​ క్యాచ్

ABOUT THE AUTHOR

...view details