తెలంగాణ

telangana

ETV Bharat / sports

విలియమ్సన్​ను క్షమాపణలు కోరిన బెన్ స్టోక్స్

ప్రపంచకప్​ ఫైనల్​ మ్యాచ్​లో రన్​ కోసం డైవ్​ చేస్తోన్న సమయంలో బ్యాట్​కు తగిలి బంతి ఫోర్​ వెళ్లిన సంఘటన.. తన ప్రమేయం లేకుండా జరిగిందని, క్షమించాలని విలియమ్సన్​ను కోరాడు ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్.

By

Published : Jul 15, 2019, 9:22 AM IST

విలియమ్సన్​ను క్షమాపణలు కోరిన బెన్ స్టోక్స్

ఒక త్రో మ్యాచ్​ను మలుపుతిప్పుతుందని, కప్పు అందకుండా చేస్తుందని ఎవరైనా ఊహిస్తారా! కానీ ఆదివారం ప్రతిష్ఠాత్మక ప్రపంచకప్​ ఫైనల్లో అదే జరిగింది. గెలిచే స్థితిలో ఉన్న న్యూజిలాండ్ రన్నరప్​గా నిలిచింది. ఓటమి ఖాయమనుకున్న ఇంగ్లాండ్.. ఏకంగా కప్పు ఎగరేసుకుపోయింది.

అసలేం జరిగింది...?

ఇంగ్లాండ్​ గెలవాలంటే 3 బంతుల్లో 9 పరుగులు కావాలి. క్రీజులో ఉన్న స్టోక్స్.. తర్వాతి బంతికి రెండు పరుగులు తీసేందుకు ప్రయత్నించాడు. బంతిని త్రో చేశాడు కివీస్ క్రికెటర్ గప్తిల్. అది కీపర్​ చేతిలోకి కాకుండా స్టోక్స్​ బ్యాటును తాకి బౌండరీ చేరింది. 2+4 మొత్తం 6 పరుగులు ఇంగ్లాండ్ ఖాతాలో చేరాయి. ఆ తర్వాత మ్యాచ్​ టైగా ముగిసింది. అనంతరం సూపర్ ఓవర్​ కూడా టై అయ్యింది. మ్యాచ్​లో ఎక్కువ బౌండరీలు సాధించిన ఇంగ్లాండ్​ విజేతగా నిలిచింది.

మ్యాచ్​ తర్వాత జరిగిన సమావేశంలో మాట్లాడిన కివీస్ కెప్టెన్ విలియమ్సన్.. ఆ సమయంలో అలా జరిగి ఉండాల్సింది కాదని అభిప్రాయపడ్డాడు.

న్యూజిలాండ్ కెప్టెన కేన్ విలియమ్సన్

"ఓడిపోయామనే విషయం నమ్మాలంటే కొంచెం కష్టమే. కానీ నమ్మక తప్పదు. మ్యాచ్​లో గెలిచే దశలో అలా జరగాల్సింది కాదు. ఏదైతేనేం మా జట్టు అద్భుతంగా ఆడింది. ఫైనల్​ మ్యాచ్​లో మరో 10-20 పరుగులు అదనంగా చేయాల్సింది. మా బౌలర్లు ప్రత్యర్థి బ్యాట్స్​మెన్​ను ఒత్తిడికి గురిచేశారు. కానీ చివరకి ఓటమి పాలయ్యాం. ఇది నిజంగా ఓ గొప్ప మ్యాచ్​" -కేన్ విలియమ్సన్, న్యూజిలాండ్ కెప్టెన్

మ్యాచ్​ గతినే మార్చిన ఆ సంఘటన.. తన ప్రమేయం లేకుండానే జరిగిందని, క్షమించాలని విలియమ్సన్​ను కోరాడు ఇంగ్లాండ్ ఆటగాడు బెన్ స్టోక్స్.

బెన్ స్టోక్స్ వ్యాఖ్యలు

ఇది చదవండి: 44 ఏళ్లలో రాని కప్పు ఇంగ్లాండ్​కు 4 ఏళ్లలో.. కారణాలివే!

ABOUT THE AUTHOR

...view details