హెడ్డింగ్లేలోని లీడ్స్ మైదానంలో ఇంగ్లాండ్, శ్రీలంక మధ్య పోరులో లంకేయులు గెలిచారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో శ్రీలంక పైచేయి సాధించింది. 233 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ 212 పరుగులకే కుప్పకూలింది. బౌలర్ మలింగ 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ వెన్ను విరిచాడు. ఫలితంగా ఆతిథ్య జట్టుపై శ్రీలంక 20 పరుగుల తేడాతో గెలిచింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో టాప్-5లోకి దూసుకెళ్లింది లంక.
మలింగ విజృంభణ..
ఈ ప్రపంచకప్‌లో టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన ఇంగ్లాండ్ అనుకున్నట్లుగానే బౌలింగ్ విభాగంలో బాగా రాణించింది. శ్రీలంకను 47 ఓవర్లలోనే ఆలౌట్ చేసి భళా అనిపించుకుంది. 233 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగింది ఇంగ్లాండ్. వరుస విజయాలతో దూసుపోతున్న జట్టు.. 300 పై చిలుకు లక్ష్యాలను అలవోకగా ఛేదించేసిన ఇంగ్లాండ్ ఫేవరెట్‌గా బరిలోకి దిగింది. ఇక ఇంగ్లాండ్ సునాయసంగా గెలిచేస్తుందన్న ఆలోచనలను పటాపంచలు చేశాడు మలింగ. కీలక ఆటగాళ్లయిన రూట్ (57), బెయిర్ స్టో (0), విన్స్(14), బట్లర్ (10) పరుగులతోనే ఫెవిలియన్ చేర్చాడు లసిత్. ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు కలిపి వరల్డ్‌కప్‌లో 50 వికెట్లు తీసిన నాలుగో బౌలర్‌గా రికార్డు సృష్టించాడు.