ప్రపంచకప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న మ్యాచ్‌లో శ్రీలంక బ్యాట్స్‌మెన్ తడబడ్డారు. 49.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌటయ్యారు లంకేయులు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన లంకేయులకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సారథి కరుణరత్నే ఇన్నింగ్స్ మొదటి బంతికేరాయల్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. కుశల్ పెరీరా, ఫెర్నాండో మరో వికెట్ పడకుండా కాసేపు జాగ్రత్తగా ఆడారు. రెండో వికెట్‌కు 67 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాక ఫెర్నాండో (30) పెవిలియన్ చేరాడు. కాసేపటికే కుశాల్ పెరీరా (30) ఔటయ్యాడు. ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోతూ లంక కష్టాల్లో పడింది.
కుశాల్ మెండిస్ (23), మాథ్యూస్ (11), డిసిల్వా (24), జీవన్ మెండిస్ (18), తిసర పెరీరా (21) ఆకట్టుకోలేక పోయారు. ఫలితంగా శ్రీలంక 49.3 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది.
దక్షిణాఫ్రికా బౌలర్లలో క్రిస్ మోరిస్, ప్రిటోరియస్ చెరో మూడు వికెట్లు తీయగా.. రబాడ రెండు, ఫెహ్లుక్వాయో, డుమినీ చెరో వికెట్‌కు దక్కించుకున్నారు.
ఇవీ చూడండి...
ఇదెలా ఔటో మీరే చెప్పండి..?