తెలంగాణ

telangana

By

Published : Jul 6, 2019, 7:03 PM IST

ETV Bharat / sports

మ్యాథ్యుస్ సెంచరీ​.. భారత లక్ష్యం 265

లీడ్స్ వేదికగా భారత్​తో మ్యాచ్​లో శ్రీలంక 7 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. మ్యాథ్యుస్ శతకంతో ఆకట్టుకోగా.. తిరిమన్నె అర్ధసెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు తీశాడు.

మ్యాథ్యుస్ అదరహో​.. భారత లక్ష్యం 265

ప్రపంచకప్​లో భాగంగా భారత్​తో మ్యాచ్​లో శ్రీలంక 7 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది శ్రీలంక. మ్యాథ్యూస్ శతకంతో చెలరేగగా.. తిరిమన్నె అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. భారత బౌలర్లలో బుమ్రా 3 వికెట్లు తీయగా.. కుల్దీప్, జడేజా, పాండ్య, భువనేశ్వర్ తలో వికెట్ తీశారు.

తొలి నలుగురు బ్యాట్స్​మెన్లను తక్కువ పరుగులకే పెవిలియన్​కు పంపారు భారత బౌలర్లు. 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతూ కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్నారు మ్యాథ్యుస్ (113), తిరిమన్నె (53). వీరిద్దరూ ఐదో వికెట్​కు 124 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కుదురుకున్నాక ఎడపెడా బౌండరీలు బాదుతూ లంకకు గౌరవప్రదమైన స్కోరు చేసేలా తోడ్పడ్డారు. తిరిమన్నెను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు కుల్దీప్ యాదవ్.

సెంచరీతో ఆకట్టుకున్న మాథ్యూస్

అయినప్పటికీ మ్యాథ్యుస్ నిలకడగా ఆడుతూ శతకం సాధించాడు. 115 బంతుల్లో వంద పురుగులు పూర్తి చేసి కెరీర్​లో 3వ సెంచరీని నమోదు చేశాడు మ్యాథ్యుస్. ప్రపంచకప్​లో మాథ్యూస్​కు ఇది తొలి శతకం.

భారత బౌలర్లలో అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా 37 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. భువనేశ్వర్, హార్దిక్, జడేజా, కుల్దీప్​ తలో వికెట్ దక్కించుకున్నారు.

అద్భుతంగా బౌలింగ్ చేసిన బుమ్రా

ABOUT THE AUTHOR

...view details