ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ప్రపంచకప్ తొలిమ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లండన్ కెన్నింగ్టన్ వేదికగా తలపడే ఈ మ్యాచ్‌లో పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించనుంది. ఇయాన్ మోర్గాన్ సారథ్యంలో ఇంగ్లాండ్ బరిలో దిగనుండగా... దక్షిణాఫ్రికా జట్టును డూప్లెసిస్ లీడ్ చేస్తున్నాడు.
ఇప్పటికే వార్మప్ మ్యాచ్‌ల్లో ఇరు జట్లు సత్తాచాటాయి. వన్డే ఫార్మాట్లో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఇంగ్లీషు జట్టు మూడో ర్యాంకులో ఉన్న దక్షిణాఫ్రికాతో పోటీపడుతోంది. ఈ మ్యాచ్‌లో గెలిచి వరల్డ్‌కప్‌ను ఘనంగా ఆరంభించాలనుకుంటున్నాయి ఇరుజట్లు.
జట్లు..