ప్రపంచకప్‌లో వరుస ఓటములతో ఇబ్బందిపడుతోన్న దక్షిణాఫ్రికా జట్టు న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లోనూ అదే పంతా కొనసాగించింది. వర్షం కారణంగా ఆలస్యంగా ప్రారంభమైన ఆటను 49 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు నిర్ణీత 49 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసింది. ఆమ్లా, డసెన్ అర్ధశతకాలతో రాణించడం వల్ల ఆ మాత్రం స్కోరైనా సాధించారు సఫారీలు.
దక్షిణాఫ్రికా జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్లోనే ఓపెనర్ డికాక్ (5) పెవిలియన్ చేరాడు. సారథి డుప్లెసిస్‌తో కలిసి ఆమ్లా రెండో వికెట్‌కు 50 పరుగులు జోడించాడు. అనంతరం డుప్లెసిస్ 23 పరుగులు చేసి ఔటయ్యాడు. మర్కరమ్తో కలిసి మరో అర్ధశతక భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు ఆమ్లా. ఈ క్రమంలోనే అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అంతేకాకుండా వన్డేల్లో 8వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు హషీమ్ ఆమ్లా.