తెలంగాణ

telangana

ETV Bharat / sports

వర్షం కారణంగా దక్షిణాఫ్రికా - విండీస్ మ్యాచ్​ రద్దు - ప్రోటీస్

దక్షిణాఫ్రికా

By

Published : Jun 10, 2019, 3:26 PM IST

Updated : Jun 10, 2019, 9:16 PM IST

2019-06-10 21:01:53

విండీస్ - దక్షిణాఫ్రికా మ్యాచ్ వర్షార్పణం

సౌతాంప్టన్ వేదికగా వెస్టిండీస్ - దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. చాలాసేపటివరకు కురిసిన వర్షం మధ్యలో ఆగినా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా ఉండటంతో మ్యాచ్​ నిర్వహించేందుకు వీలు పడలేదు. మేఘావృతమై ఉండటంతో రిఫరీ మ్యాచ్ నిలిపివేశాడు. ఇరు జట్లకు చెరో పాయింట్ లభించింది.

టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన దక్షిణాఫ్రికా 7.3 ఓవర్లలో 2 వికెట్ల కోల్పోయి 29 పరుగులు చేసింది. జూన్ 7న బ్రిస్టల్ వేదికగా జరగాల్సిన శ్రీలంక - పాకిస్థాన్ మ్యాచ్​ కూడా వర్షం కారణంగా రద్దయింది.

2019-06-10 15:41:39

ప్రొటీస్​ మ్యాచ్​కు వర్షం అంతరాయం

మ్యాచ్ 7.3 ఓవర్ల జరిగిన అనంతరం వర్షం అడ్డంకిగా మారింది. తాత్కాలికంగా మ్యాచ్​ను నిలిపివేశారు. టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన దక్షిణాఫ్రికా 2 వికెట్ల నష్టానికి 29 పరుగులు చేసింది. ప్రస్తుతం డూప్లెసిస్(0), డికాక్​(17) క్రీజులో ఉన్నారు. విండీస్ బౌలర్ షెల్డన్ కాట్రెల్ రెండు వికెట్లు తీశాడు.

2019-06-10 15:32:29

కాట్రెల్ బౌలింగ్​లో మార్కరమ్ ఔట్​

ఏడో ఓవర్ బంతికే మార్కరమ్ ఔటయ్యాడు. కాట్రెల్ బౌలింగ్​లో షాయ్ హోప్​కు క్యాచ్​ ఇచ్చాడు. ఏడు ఓవర్లలో దక్షిణాఫ్రికా స్కోరు 28/2

2019-06-10 15:26:25

ఆరు ఓవర్లకు సఫారీల స్కోరు 27/1

5వ ఓవర్​ వేసిన కాట్రెల్ 8 పరుగులిచ్చాడు. అనంతరం ఆరో ఓవర్లో రోచ్ కేవలం 2 పరుగులే ఇచ్చాడు. 6 ఓవర్లలో వికెట్ నష్టానికి 27 పరుగులు చేసింది దక్షిణాఫ్రికా

2019-06-10 15:16:26

తొలి వికెట్ కోల్పోయిన ప్రొటీస్​

ప్రపంచకప్‌ సమరంలో భాగంగా మరో ఆసక్తికర పోరు  మొదలయింది. సౌథాంప్టన్‌ వేదికగా వెస్టిండీస్‌- దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్‌ ప్రారంభమయింది. ఇందులో భాగంగా విండీస్‌ టాస్‌ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఎన్నో అంచనాలతో మెగాటోర్నీలో అడుగు పెట్టిన సఫారీ జట్టు  6 పరుగులకే ఆమ్లా తొలి వికెట్​ కోల్పోయింది.

వెస్టిండీస్‌ జట్టు: క్రిస్‌ గేల్‌, షాయ్‌ హోప్‌, డారెన్‌ బ్రావో, నికోలస్‌ పూరన్‌, షిమ్రోన్‌ హెట్మెయిర్‌, జేసన్‌ హోల్డర్‌, బ్రాత్‌వైట్‌, ఆష్లే నర్స్‌, కేమర్‌ రోచ్‌, షెల్డాన్‌ కోట్రెల్‌, ఒషానే థామస్‌.

దక్షిణాఫ్రికా జట్టు: హషీమ్‌ ఆమ్లా, డికాక్‌, డుప్లెసిస్‌, ఐడెన్‌ మార్క్‌రమ్‌, రస్సీ వండెర్‌ దుస్సేన్‌, డేవిడ్‌ మిల్లర్‌, ఆండిల్‌ ఫెలుక్వాయో, క్రిస్‌ మోరిస్‌, కగిసో రబాడా, ఇమ్రాన్‌ తాహిర్‌, బ్యూరాన్‌ హెండ్రిక్స్‌.

Last Updated : Jun 10, 2019, 9:16 PM IST

ABOUT THE AUTHOR

...view details