తెలంగాణ

telangana

ETV Bharat / sports

కంగారూల జోరుకు సఫారీలు బ్రేక్​ వేస్తారా..?

ప్రపంచకప్‌లో నేడు మాంచెస్టర్‌ వేదికగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి. ఈ నామమాత్రపు మ్యాచ్‌లో ఎవరు గెలిచినా పెద్ద ఫలితం లేదు. కాని ఈ ఆటలో ఆసీస్​ ఓటమి భారత్​కు కలిసొచ్చే అంశం. మ్యాచ్​ భారత కాలమానం ప్రకారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభం కానుంది.

కంగారూల జోరుకు సఫారీలు బ్రేక్​ వేస్తారా..?

By

Published : Jul 6, 2019, 9:03 AM IST

వన్డే ప్రపంచకప్‌లో ఈరోజు ఆసీస్​, సఫారీ జట్లు పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్​లోనూ గెలిచి ఆత్మవిశ్వాసంతో సెమీస్​ చేరాలని భావిస్తోంది ఫించ్​ సేన​. తన చివరి లీగ్‌ మ్యాచ్‌లో గెలిచి ప్రపంచకప్​కు వీడ్కోలు పలకాలని పట్టుదలతో ఉంది డుప్లెసిస్​ జట్టు.

దక్షిణాఫ్రికా నిరాశ...

విశ్వ సమరంలో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయిన దక్షిణాఫ్రికా తన చివరి లీగ్ మ్యాచ్‌ ఆడేందుకు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో శ్రీలంకపై అన్ని విభాగాల్లో ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించింది ప్రొటీస్‌ జట్టు.

లంకతో జరిగిన మ్యాచ్‌లో హషీమ్‌ అమ్లా, సారథి డుప్లెసిస్‌ మంచి ప్రదర్శన కనబరిచారు. బౌలింగ్‌లో రబాడ, మోరిస్‌ రాణిస్తున్నారు. కానీ వరుస పరాజయాలతో కుదేలైన ప్రొటీస్‌ జట్టు బలమైన ఆస్ట్రేలియాకు ఎంతవరకు పోటీ ఇవ్వగలదో చూడాలి. సామర్థ్యం మేరకు రాణిస్తే కంగారులను ఓడించడం అంత కష్టం కాదని దక్షిణాఫ్రికా భావిస్తోంది.

ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎనిమిదో స్థానంలో ఉన్న డుప్లెసిస్‌ సేన... చివరి మ్యాచ్‌లో గెలిచి స్వదేశానికి పయనం కావాలనుకుంటోంది.

ఆస్ట్రేలియా అదరహో..

వరుస విజయాలతో దూకుడు మీదున్న ఆస్ట్రేలియా సెమీస్ మ్యాచ్‌కు ముందు దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించాలని చూస్తోంది. 2018లో ప్రొటీస్‌తో జరిగిన మ్యాచ్‌లోనే బాల్‌ ట్యాంపరింగ్‌ కారణంగా స్మిత్‌, వార్నర్‌ ఏడాది నిషేధానికి గురయ్యారు. మళ్లీ ఈ ఇద్దరు ఆటగాళ్లు దక్షిణాఫ్రికాపై బరిలోకి దిగుతుండటం ఆసక్తి కలిగిస్తోంది.

వార్నర్‌, ఫించ్‌, స్మిత్‌ బ్యాటింగ్​లో రాణిస్తున్నారు. మిచెల్‌ స్టార్క్‌, స్టొయినిస్‌, పాట్ కమ్మిన్స్‌ బౌలింగ్‌లో ప్రతాపం చూపిస్తున్నారు.

జట్లు...

  • ఆస్ట్రేలియా:

డేవిడ్​ వార్నర్​, ఆరోన్​ ఫించ్​(సారథి), ఖవాజా, స్టీవ్​ స్మిత్​, పీటర్​ హ్యాండ్స్​కోంబ్​, మార్కస్​ స్టొయినిస్​, అలెక్స్​ క్యారీ(కీపర్​), కమిన్స్​, మిచెల్​ స్టార్క్​, లయన్​, బెహ్రెండార్ఫ్​

  • దక్షిణాఫ్రికా:

హషీమ్​ ఆమ్లా, డి కాక్​(కీపర్​), డుప్లెసిస్​(సారథి), మర్కరమ్​, వాండర్​ డుస్సెన్​, డుమినీ, ఫెలుక్వాయో, ప్రిటోరియస్​, క్రిస్​ మోరిస్​, రబాడ, తాహిర్

దక్షిణాఫ్రికా చేతిలో ఆస్ట్రేలియా ఓడిపోయి... శ్రీలంకపై భారత్‌ గెలిస్తే కోహ్లీ సేన పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుతుంది. అప్పుడు సెమీస్‌లో టీమిండియా ప్రత్యర్థి న్యూజిలాండ్‌ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details