తెలంగాణ

telangana

ETV Bharat / sports

'కెప్టెన్​ మెదడు లేనోడు... అందుకే పాక్​ ఓడింది'

పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​, రావల్ ​పిండి ఎక్స్​ప్రెస్​ షోయబ్​ అక్తర్​ ఆ దేశ క్రికెట్​ కెప్టెన్ సర్ఫ​రాజ్​ అహ్మద్​పై నిప్పులు చెరిగాడు. మాంచెస్టర్​ వేదికగా భారత్​తో పోరులో​ పాక్​ జట్టు ఓటమిపై తీవ్ర విమర్శలు చేశాడు అక్తర్​. సర్ఫరాజ్​ అహ్మద్​ మెదడు లేని సారథి అని అభివర్ణించాడు.

'కెప్టెన్​ మెదడు లేనోడు...అందుకే పాక్​ ఓడింది'

By

Published : Jun 17, 2019, 10:38 PM IST

ప్రపంచకప్​లో భారత్​పై పాకిస్థాన్​ దారుణ పరాభవానికి పాకిస్థాన్​ మాజీ ఫాస్ట్ బౌలర్​ షోయబ్​ అక్తర్​ తీవ్రంగా కలత చెందాడు. ప్రపంచకప్​లో ఈ పాక్​ జట్టు నుంచి ఎక్కువ ఆశించొద్దని అభిమానులకు సూచించాడు.
ఆదివారం మాంచెస్టర్​లోని ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా టీమిండియాతో తలపడిన పాక్​.... డక్​వర్త్​ లూయిస్​ ప్రకారం 89 పరుగుల తేడాతో ఓడిపోయింది. ప్రపంచకప్​లో ఏడవ ఓటమిని నమోదు చేసుకున్న జట్టుపై పాక్​ మాజీ క్రికెటర్​ షోయబ్​ అక్తర్​ దారుణంగా విమర్శలు చేశాడు. సారథి సర్ఫరాజ్​ టాస్​ గెలిచి బౌలింగ్​ ఎంచుకోవడంపై మండిపడ్డాడు. ఫాస్ట్​ బౌలర్​ హసన్​ అలీపైనా విరుచుకుపడ్డాడు అక్తర్​. హసన్​కు టీ20లు, పాక్​ ప్రీమియర్​ లీగ్​లో ఆడటంపై ఉన్న దృష్టి... దేశం కోసం ఆడటంలో లేదంటూ విమర్శలు కురిపించాడు.

ఛేజింగ్​లో చెత్త రికార్డు​ అయినా ఎంచుకున్నావ్​...

టాస్​ గెలిచిన పాకిస్థాన్​ మొదట భారత్​ను బ్యాటింగ్​కు ఆహ్వానించగా... టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 336 పరుగుల లక్ష్యం నిర్దేశించింది. ఛేదనలో పాక్​ జట్టు 40 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 212 పరుగులు మాత్రమే చేయగలిగింది.

పాక్​ ఆటగాళ్ల ప్రదర్శనపై ఆగ్రహం చెందిన షోయబ్​ అక్తర్​... కెప్టెన్​, మేనేజిమెంటుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఆగ్రహం వెళ్లగక్కాడు. సర్ఫ​రాజ్​ ఖాన్​ బ్రెయిన్​ లేని కెప్టెన్​ అని అందుకే టాస్​ గెలిచినా బౌలింగ్​ తీసుకున్నాడని సంబోధించాడు.

"2017 ఛాంపియన్స్​ ట్రోఫీ ఫైనల్​లో భారత్​ చేసిన తప్పే పాక్​ జట్టు చేసింది. సర్ఫరాజ్​ఖాన్​ ఇంత మెదడు లేనివాడని నాకు తెలియదు. ఛేజింగ్​లో పాక్​కు సరైన రికార్డు లేదని తెలిసినా ఎలా బౌలింగ్​ ఎంచుకున్నాడు. టాస్​ గెలిచినపుడే పాక్​ సగం విజయం సాధించినట్టు కానీ చాలా కష్టపడి మ్యాచ్​ను ఓడించాడు. బౌలింగ్​ పాకిస్థాన్​ బలం. పాక్​ మొదట బ్యాటింగ్​ చేసి 260 చేసినా బౌలింగ్​తో వాటిని కాపాడుకోగలదు. కాని అవేమి ఆలోచించని సర్ఫరాజ్ ​ఖాన్​ ఓ బ్రెయిన్​లెస్​ కెప్టెన్​. ఓ సారథిగా జట్టుకు ఘోర పరాభవాన్ని అందించాడు ".

--అక్తర్​, పాకిస్థాన్​ మాజీ క్రికెటర్​

ఈ మ్యాచ్​లో పేసర్​ హసన్​ అలీ 9 ఓవర్లు వేసి 84 పరుగులు సమర్పించకున్నాడు. దీనిపైనా అక్తర్​ మాటలదాడికి దిగాడు. పాకిస్థాన్​ అభిమానులు ఈ సాధారణ​ పాకిస్థానీ ఆటగాళ్ల నుంచి ఎక్కువ ఆశించకండి అంటూ సూచించాడు.సర్ఫ​రాజ్​కు పదో తరగతి పిల్లాడికి ఉన్న జ్ఞానం కూడా లేదని... పాక్​ జట్టు గెలిచేందుకు మేనేజిమెంటు, కోచ్​ మైక్​ ఆర్థర్​లు ఏం సలహాలు ఇచ్చారని మండిపడ్డాడు. జట్టులో స్ఫూర్తి నింపుతూ పాక్​ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​ ట్వీట్లు చేశారు. అతడి మాటలనూ పట్టించుకోలేదు అందుకే ఓటమి తప్పలేదని అభిప్రాయపడ్డాడు.

పాకిస్థాన్​ ఐదు మ్యాచ్​ల్లో ఒక్కటి గెలిచి, మరోటి వర్షం కారణంగా రద్దవ్వడం వల్ల 3 పాయింట్లతో చివరి నుంచి రెండో స్థానంలో నిలిచింది. తర్వాతి మ్యాచ్​లో​ దక్షిణాఫ్రికాతో ఆదివారం లార్డ్స్​లో తలపడనుంది.

ABOUT THE AUTHOR

...view details