తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​ తర్వాత మరో 45 రోజులు కోచ్​ రవిశాస్త్రే - coach

ప్రపంచకప్​ ముగిసిన తర్వాత కూడా భారత కోచ్ రవిశాస్త్రిని మరో 45 రోజులు కొనసాగించాలని క్రికెట్ పాలక కమిటీ నిర్ణయం తీసుకుంది. రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బంది కాంట్రాక్టులను కూడా పొడిగించాలని తెలిపింది.

రవిశాస్త్రి

By

Published : Jun 13, 2019, 8:50 AM IST

టీమిండియా కోచ్ రవిశాస్త్రి కాంట్రాక్టును మరో 45 రోజులు కొనసాగించాలని బీసీసీఐ క్రికెట్​ పాలక కమిటీ(సీఓఏ) నిర్ణయించింది. ప్రపంచకప్​ తర్వాత రవిశాస్త్రితో పాటు అతడి సహాయక సిబ్బంది కాంట్రాక్టులు ముగుస్తాయి. ఈ అంశంపై చర్చించి 45 రోజులు పొడిగించాలని నిర్ణయం తీసుకుంది సీఓఏ.

"రవిశాస్త్రితో సహా మిగిలిన సహాయక సిబ్బంది కాంట్రాక్టులు ఈ ప్రపంచకప్​ తర్వాత ముగుస్తాయి. దీనిపై చర్చించి 45 రోజులు పొడిగించాలని నిర్ణయించాం" - సీఓఏ

రవిశాస్త్రితో పాటు సహాయక సిబ్బందిలో ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్, బ్యాటింగ్ కోచ్​ సంజయ్ బంగర్​, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ కాంట్రాక్టు ముగిసేవారి జాబితాలో ఉన్నారు. ఆసక్తికర విషయమేంటంటే వీరి కాంట్రాక్టు కొనసాగింపుకు సంబంధించి ఎలాంటి క్లాజ్​ పేర్కొనలేదు.

2017లో భారత కోచ్​గా అనిల్​కుంబ్లే వైదొలిగిన తర్వాత రవిశాస్త్రి ఆ పదవిని చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details