మెగాటోర్నీ కీలక సమయంలో ఆస్ట్రేలియా జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ షాన్ మార్ష్ గాయం కారణంగా ప్రపంచకప్‌నకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఐసీసీ ట్విట్టర్లో పేర్కొంది. నెట్స్‌లో సాధన చేస్తుండగా మార్ష్ మణికట్టు విరిగిందని తెలిపింది క్రికెట్ ఆస్ట్రేలియా. అతడి స్థానాన్ని వికెట్ కీపర్ పీటర్ హ్యాండ్స్‌కోంబ్‌తో భర్తీ చేయనుంది ఆ జట్టు యాజమాన్యం.
ఆస్ట్రేలియా జట్టు నుంచి షాన్ మార్ష్ ఔట్ - cricket worldcup 2019
ప్రపంచకప్‌లో నేడు చివరి లీగ్ మ్యాచ్ ఆడనుంది ఆస్ట్రేలియా . మాంచెస్టర్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరగనున్న ఈ మ్యాచ్‌కు ఆ జట్టు సీనియర్ బ్యాట్స్‌మెన్ షాన్‌మార్ష్ దూరమయ్యాడు. గాయం కారణంగా టోర్నీ మొత్తానికి దూరమైనట్లు ఐసీసీ ట్వీట్ చేసింది.
" నెట్స్‌లో సాధన చేస్తున్న సమయంలో మార్ష్, మాక్స్‌వెల్ గాయపడ్డారు. మాక్స్ గాయం తీవ్రత అంతగా లేదు. స్టార్క్, కమిన్స్ బౌలింగ్ ఎదుర్కొంటున్న సమయంలో ఈ ఘటన జరిగింది ".
--జస్టిన్ లాంగర్, ఆస్ట్రేలియా కోచ్
ఈ ప్రపంచకప్‌లో మార్ష్ రెండు మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. శ్రీలంకపై 3, పాకిస్థాన్‌పై 23 పరుగులు చేశాడు. ఆసీస్ 8 మ్యాచ్‌ల్లో ఏడు విజయాలు సాధించి పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మార్ష్ స్థానంలో జట్టులోకి వచ్చిన పీటర్.. శనివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో బరిలోకి దిగే అవకాశం ఉంది.