వన్డే ప్రపంచకప్‌లో మెరుగైన ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఆటగాళ్లలో బంగ్లాదేశ్ సీనియర్ క్రీడాకారుడు షకీబ్ ఉల్ హసన్ ఒకడు. సౌతాంప్టన్ వేదికగా సోమవారం అఫ్గానిస్థాన్‌తో మ్యాచ్‌లో ప్రపంచకప్ కెరీర్ వేయి పరుగుల మైలురాయి అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 51 పరుగులు చేసి ఔటైన షకీబ్... వన్డేల్లో 45వ అర్ధశతకాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా ప్రపంచకప్‌లో బంగ్లా తరఫున వేయి పరుగులు చేసిన తొలి ఆటగాడిగానూ రికార్డు సృష్టించాడు. ఈ మార్కు అందుకున్న 19వ ఆటగాడిగా పేరు లిఖించుకున్నాడు. ఇంగ్లండ్‌లో జరుగుతున్న ఈ మెగాటోర్నీలో 6 మ్యాచుల్లో బరిలోకి దిగిన షకీబ్... ఐదు అర్ధశతకాలు సాధించాడు. ఇప్పటివరకు 476 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు.
ప్రపంచకప్ కెరీర్లో షకీబ్ మరో మైలురాయి
బంగ్లాదేశ్ ఆల్‌రౌండర్ షకీబ్ ఉల్ హసన్ ఖాతాలో మరో రికార్డు చేరింది. సౌతాంప్టన్ వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో... ప్రపంచకప్ కెరీర్ వేయి పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయి చేరుకున్న తొలి బంగ్లాదేశీ క్రికెటర్‌గా ఘనత సాధించాడు.
ప్రపంచకప్ కెరీర్లో షకీబ్ మరో మైలురాయి