తెలంగాణ

telangana

ETV Bharat / sports

గ్లౌజ్​ దుమారంపై ధోనికి వీరేంద్రుడి సలహా - భారత మాజీ క్రికెటర్​ వీరేంద్రసింగ్​ సెహ్వాగ్

గ్లౌజ్​పై బలిదాన్​ గుర్తు వాడకంపై ధోనికి సలహా ఇచ్చాడు భారత మాజీ క్రికెటర్​ వీరేంద్ర​ సెహ్వాగ్​. ఐసీసీ నిబంధనను అతిక్రమించకుండా ఆ గుర్తును ఉపయోగించే మార్గాన్ని సూచించాడు. అంతేకాకుండా ప్రత్యక్షంగా మ్యాచ్​ చూసే భారత క్రికెట్​ అభిమానులకూ ఓ సూచన చేశాడు.

'ధోని బలిదాన్​ బ్యాడ్జ్​ ఇలా పెట్టుకో... ఐసీసీ అడ్డుచెప్పదు'

By

Published : Jun 9, 2019, 6:47 AM IST

Updated : Jun 9, 2019, 8:37 AM IST

దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో భారత వికెట్‌ కీపర్‌ మహేంద్ర సింగ్​ ధోని గ్లౌజులపై సైనిక అధికారిక చిహ్నం 'బలిదాన్‌' ఉండడం పట్ల ఐసీసీ అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీనిపై చాలా మంది మాజీ ఆటగాళ్లు, క్రికెట్​ బోర్డు అధికారులు, ప్రముఖులు స్పందించారు. అయితే తాజాగా ధోనికి టీమిండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్​ ఓ వినూత్న సలహా చెప్పాడు. ఈ విధంగా చేస్తే ఐసీసీ ఆ లోగో ధరించకుండా అడ్డుకోలేదని సూచించాడు.

" బలిదాన్​ బ్యాడ్జ్​ వాడటాన్ని ఐసీసీ ఒప్పుకోలేదు కదా.. అయితే ఇలా ప్రయత్నించు. బ్యాటుపై రెండు లోగోలను బ్యాట్స్​మెన్​ అతికించుకునే అవకాశం ఉంది. అందులో ఒక లోగో రూపంలో బలిదాన్​ చిహ్నాన్ని వాడు. గ్లౌజులపై ఆ చిహ్నాం ఉంటే తప్పు కాని బ్యాటుపై కాదు. గ్లౌజులపై కాకుండా బలిదాన్​ గుర్తును బ్యాట్​పై వాడేందుకు రాతపూర్వకంగా అనుమతి తీసుకో. దానికి ఐసీసీ కచ్చితంగా అనుమతి ఇస్తుంది. ఎందుకంటే బ్యాటుపై తయారీ సంస్థ సహా మరో లోగో ఆటగాడికి సంబంధించినది వాడుకోవచ్చు".
-- సెహ్వాగ్​, భారత మాజీ క్రికెటర్​

సొంత గుర్తుతో సెహ్వాగ్​ బ్యాట్​లు

గతంలోనూ సెహ్వాగ్​ ఎస్​ఐఎస్​జే.ఇన్​ (సెహ్వాగ్​ అంతర్జాతీయ పాఠశాల) పేరును ఇలాగే బ్యాటుపై ముద్రించుకున్నాడు. దీనికి ఐసీసీ అనుమతి ఇచ్చింది. దానిని చాలా మ్యాచ్​ల్లో ఉపయోగించినట్లు ధోనికి సూచించాడు సెహ్వాగ్​. అంతేకాకుండా బలిదాన్​ బ్యాడ్జితో మ్యాచ్​ వీక్షించాలనిభారత ప్రజలను కోరాడు.

"భారత సైనికులంటే నాకే కాదు... ధోనికి, దేశ ప్రజలకు చాలా అభిమానం. అయితే వాళ్లని మనం గౌరవించాలంటే బలిదాన్​ బ్యాడ్జ్​తో మ్యాచ్​ వీక్షించాలి. ఆ గుర్తును ఫొటో తీయండి. మీ నిరనసను వీడియోలుగా తీసి సోషల్​ మీడియాలో నన్ను లేదా ధోనిని ట్యాగ్​ చేసి పోస్ట్​ చేయండి. నేను మీ భావోద్వేగాలను రీట్వీట్​, లైక్​, షేర్​ చేసేందుకు ప్రయత్నిస్తా" అని చెప్పుకొచ్చాడు సెహ్వాగ్​.

జూన్​ 9న ఆసీస్​తో జరగనున్న మ్యాచ్​లో భారత్​ గెలుస్తుందని ఆశాభవం వ్యక్తం చేశాడు వీరూ. ధోనీ 'మ్యాన్​ ఆఫ్​ ద మ్యాచ్'​ గెలుస్తాడని జోస్యం చెప్పాడు.

ఇవీ చూడండి:

ధోనీ గ్లౌజు​లపై బలిదాన్​ గుర్తు తొలగించాలి: ఐసీసీ

Last Updated : Jun 9, 2019, 8:37 AM IST

ABOUT THE AUTHOR

...view details