తెలంగాణ

telangana

ETV Bharat / sports

పాక్​-అఫ్గాన్ మ్యాచ్​కు ముందు ఘర్షణ

వరల్డ్​కప్​లో భాగంగా లీడ్స్​ వేదికగా జరుగుతోన్న అఫ్గాన్​, పాకిస్థాన్​ మ్యాచ్​కు ముందు ఘర్షణ చెలరేగింది. మైదానం వెలుపల ఇరు జట్ల అభిమానులు కొట్టుకున్నారు. దీనంతటికి కారణం ఓ ఎయిర్​క్రాఫ్ట్​ 'జస్టిస్​ ఫర్​ బలూచిస్థాన్'​ బ్యానర్​తో ​ వెళ్లడమేనని తెలుస్తోంది.

పాక్​-అఫ్గాన్ మ్యాచ్​లో కుమ్ములాట

By

Published : Jun 29, 2019, 8:04 PM IST

Updated : Jun 30, 2019, 7:59 AM IST

హెడింగ్లేలోని లీడ్స్​ మైదానం వెలుపల అఫ్గాన్​, పాక్​ అభిమానులు కొట్టుకున్నారు. ఓ ఎయిర్​క్రాఫ్ట్​ గాలిలో ఎగురుతూ బలోచిస్థాన్​కు న్యాయం చేయాలని ఓ బ్యానర్​ను ప్రదర్శించడమే కారణంగా తెలుస్తోంది. బలోచిస్థాన్​ నినాదాలతో ఓ ఫ్లయిట్​ స్టేడియం బయట తిరగడాన్ని పాక్​ అభిమానులు గుర్తించారు. ఇదే ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనపై ఐసీసీ ప్రతినిధి వివరణ ఇచ్చారు.

"మైదానం వెలుపల సంచరించిన ఎయిర్​క్రాఫ్ట్​కు ​ అనుమతి లేదు. లీడ్స్​ ఎయిర్​ ట్రాఫిక్​ దీనిపై విచారణ చేపట్టింది"
-ఐసీసీ ప్రతినిధి

మ్యాచ్​కు ముందు కొందరు అభిమానులు స్టేడియం గోడ దూకి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. తమ హక్కులను హరిస్తోన్న పాక్​ నుంచి కాపాడాలంటూ వరల్డ్​ బలోచ్​ ఆర్గనైజేషన్​,బలోచి రిపబ్లికన్​ పార్టీ ప్రచారం నిర్వహిస్తున్నాయి.

ఇటీవల బర్మింగ్​హామ్​ స్టేడియం బయట ఇదే విధంగా బ్యానర్లు ప్రదర్శించారు బలోచిస్థాన్​ నిరసనకారులు. జూన్​ 26న పాకిస్థాన్​, న్యూజిలాండ్​ మ్యాచ్​కు ముందు రోడ్లు, జంక్షన్ల వద్ద పోస్టర్లు ప్రదర్శించారు. శనివారం లీడ్స్​ వేదికగా అఫ్గాన్​తో జరుగుతున్న మ్యాచ్​ సమయంలోనూ ఇదే తరహాలో నిరసన ప్రదర్శన చేసినట్లు తెలుస్తోంది.

Last Updated : Jun 30, 2019, 7:59 AM IST

ABOUT THE AUTHOR

...view details