పాక్ సారథి సర్ఫ్రాజ్ అహ్మద్ నెటిజన్ల చేతికి చిక్కాడు. భారత్‌తో మ్యాచ్ జరుగుతుండగా... ఆవలిస్తూ కనిపించాడీ క్రికెటర్. ఈ సంఘటన భారత ఇన్నింగ్స్ 46.4వ ఓవర్ వద్ద చోటు చేసుకుంది. వర్షం కారణంగా ఆట అరగంట నిలిచింది. అనంతరం తిరిగి ప్రారంభమైన సమయంలో సర్ఫ్రాజ్ ఆవలిస్తూ స్టేడియంలోకి వచ్చాడు. ప్రస్తుతం ఆ ఫొటోలను ట్రోలింగ్ చేస్తున్నారు నెటిజన్లు. అంతేకాకుండా మ్యాచ్‌లో అతడి కదలికల్ని కామెంట్లుగా పెట్టి మీమ్స్‌తో నింపేస్తున్నారు.
పాక్ సారథి సర్ఫ్రాజ్ ఆవలింతలు... నెట్టింట ట్రోల్ - sarfaraz khan yawning trolling
ఐసీసీ పురుషుల క్రికెట్ వరల్డ్ కప్‌లో భాగంగా నేడు భారత్- పాకిస్థాన్ మధ్య మ్యాచ్. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో సర్ఫ్రాజ్ చేసిన ఆవలింతలు నెట్టింట వైరల్‌గా మారాయి.
పాక్ సారథి సర్ఫరాజ్ ఆవలింతలు... నైట్టింట ట్రోల్
తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది పాకిస్థాన్. భారత ఓపెనర్లు 136 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్మించి ఇన్నింగ్స్‌కు మంచి పునాది వేశారు. రోహిత్ కెరీర్లో 24వ శతకం ఖాతాలో వేసుకున్నాడు. విరాట్ వన్డేల్లో వేగంగా 11వేల పరుగుల మైలురాయి అందుకొని రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్‌లో నిర్ణీత 50 ఓవర్లకు 336 పరుగులు చేసింది టీమిండియా.