తెలంగాణ

telangana

ETV Bharat / sports

'గల్లీ క్రికెటర్​కు క్షమాపణ చెప్పు' - manjrekar

సెమీస్​ మ్యాచ్​లో జడేజా ప్రదర్శనపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే జడ్డూపై నోరుపారేసుకున్న వ్యాఖ్యాత సంజయ్ మాంజ్రేకర్ అతడి ప్రదర్శన బాగుందని ట్వీట్ చేశాడు. ఈ అంశంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

జడేజా - మాంజ్రేకర్

By

Published : Jul 11, 2019, 1:13 PM IST

న్యూజిలాండ్​తో జరిగిన ప్రపంచకప్ సెమీస్ మ్యాచ్​లో భారత్ ఓడినప్పటికీ జడేజా, ధోనీ అద్భుతంగా ఆడారని ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇంతకు ముందు జడేజాపై తీవ్ర విమర్శలు చేసిన వ్యాఖ్యాత సంజయ్ మాంజ్రేకర్.. ఈ మ్యాచ్​లో జడేజా బాగా ఆడాడని ట్వీట్ చేశాడు. దీనిపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జడేజా నువ్వు అనుకున్న జట్టులో లేకపోయినా.. సెమీస్​లో చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇప్పుడేమంటావ్ మాంజ్రేకర్​ అంటూ ఒకరు ట్వీట్ చేశారు.

బిట్స్ అండ్ పీసెస్ క్రికెటర్​కు నువ్వు(మాంజ్రేకర్​) లిఖిత పూర్వకంగా క్షమాపణలు చెప్పాలి అంటూ మరొకరు కామెంట్ పెట్టారు.

అసలు ఏం జరిగిందంటే..

లీగ్​లో బంగ్లాదేశ్ మ్యాచ్ సందర్భంగా రవీంద్ర జడేజాపై మాంజ్రేకర్​ నోరు పారేసుకున్నాడు. దీనికి కౌంటర్ ఇచ్చాడు జడ్డూ. అనంతరం శ్రీలంక మ్యాచ్​లో కుశాల్ మెండిస్ వికెట్ తీసిన జడేజాను వ్యాఖ్యాతగా ఉన్న సంజయ్​ "స్మార్ట్​ గల్లీ క్రికెటర్" అంటూ సంబోధించాడు. ఈ అంశంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు.

"జడేజా లాంటి బిట్స్ అండ్ పీసెస్ ఆటగాళ్లకు నేను అభిమానిని కాదు, అతడు నా జట్టులోనే ఉండడు" అని విమర్శించాడు.

అయితే మాంజ్రేకర్​ వ్యాఖ్యలకు జడైజా ఘాటుగా స్పందించాడు. ఆటగాళ్లను గౌరవించడం నేర్చుకో.. నీ చెత్త వాగుడు ఆపు అంటూ ట్వీట్ చేశాడు.

మాంచెస్టర్ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడింది. జడేజా 77 పరుగులతో ఆకట్టుకున్నాడు. వరల్డ్​కప్​ టోర్నీలో 8వ స్థానంలో వచ్చి అర్ధశతకం సాధించిన మొదటి భారత బ్యాట్స్​మన్​గా జడేజా రికార్డు సృష్టించాడు.

ABOUT THE AUTHOR

...view details