తెలంగాణ

telangana

ETV Bharat / sports

షోయబ్​ మాలిక్​తో సానియా కొత్త కథ షురూ - sania meerza

పాకిస్థాన్ సీనియర్ బ్యాట్స్​మన్ మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయంపై భారత టెన్నిస్ స్టార్, అతడి సతీమణి సానియా ట్వీట్ చేసింది. నీ పట్ల ఎంతో గర్వంగా ఉందని తెలిపింది.

సానియా

By

Published : Jul 6, 2019, 4:09 PM IST

పాకిస్థాన్ సీనియర్ క్రికెటర్ మాలిక్ అంతర్జాతీయ క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు. బంగ్లాదేశ్​తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్​లో పాక్​ 94 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్​లో మాలిక్ ఆడలేదు. ఈ ఆట అనంతరం మాలిక్​ రిటైర్మెంట్ ప్రకటించాడు.

మాలిక్ రిటైర్మెంట్​పై భారత టెన్నిస్ స్టార్, అతడి సతీమణి సానియా స్పందించింది. నీ పట్ల గర్వంగా ఉందంటూ ట్వీట్ చేసింది.

"ప్రతి కథకు ఒక ముగింపు ఉంటుంది. జీవితంలో ప్రతి ముగింపూ మరో కొత్త ప్రారంభమే. మాలిక్‌.. 20 ఏళ్ల పాటు నీ దేశం తరఫున ఎంతో నిబద్ధతతో, వినయంగా ఆడావు. నువ్వు సాధించిన వాటికి నేను, ఇజాన్‌ ఎంతో గర్వపడుతున్నాం" అని సానియా ట్వీట్‌ చేసింది.

సానియా ట్వీట్

ప్రపంచకప్‌లో మాలిక్‌ మూడు మ్యాచ్‌లు ఆడి కేవలం ఎనిమిది పరుగులే చేశాడు. రెండు మ్యాచ్‌ల్లో డకౌట్‌గా వెనుతిరిగాడు. టీమిండియా మ్యాచ్‌లో ప్రదర్శనపై విమర్శలు ఎదుర్కొన్నాడు. మ్యాచ్‌కు ముందు రోజు మాలిక్‌ తన భార్యతో కలిసి డిన్నర్‌లో పాల్గొన్నాడనే ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యాయి. ఈ విషయం తనను చాలా బాధ పెట్టిందని మాలిక్‌ మ్యాచ్ అనంతరం తెలిపాడు.

ఇవీ చూడండి.. రిటైర్మెంట్​పై మహేంద్రుడి మాట ఇదే...

ABOUT THE AUTHOR

...view details