తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​ ఫైనల్​లో సచిన్ రికార్డు బద్దలవుతుందా? - world cup

ప్రపంచకప్​ తుదిపోరులో తలపడుతున్నాయి ఇంగ్లాండ్- న్యూజిలాండ్. ఇరుజట్లలోని రూట్, విలియమ్సన్.. దిగ్గజ క్రికెటర్​ సచిన్ తెందుల్కర్ రికార్డుకు చేరువలో ఉన్నారు. మరి వీరిద్దరూ ఈ ఘనత సాధిస్తారా లేదా? అనేది చూడాలి. ఆదివారం లార్డ్స్ వేదికగా ఈ మ్యాచ్​ జరగనుంది.

ప్రపంచకప్​ ఫైనల్​లో సచిన్ రికార్డు బద్దలవుతుందా!

By

Published : Jul 13, 2019, 8:00 AM IST

Updated : Jul 13, 2019, 8:31 AM IST

ప్రపంచకప్​ ఫైనల్​కు అంతా సిద్ధమైంది. ప్రఖ్యాత లార్డ్స్ మైదానంలో ఇంగ్లాండ్​- న్యూజిలాండ్​ తాడోపేడో తేల్చుకోనున్నాయి. ఎవరు గెలిచినా తొలిసారి కప్పును అందుకున్న ఘనత సాధిస్తారు. ఈ క్రమంలోనే ఇరుజట్లలోని ప్రధాన బ్యాట్స్​మెన్​ రూట్, విలియమ్సన్​లు.. దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్ రికార్డుపై కన్నేశారు.

రూట్- విలియమ్సన్

సచిన్ తెందుల్కర్- 673 పరుగులు

ఓ ప్రపంచకప్​లో అత్యధిక పరుగులు చేసిన ఘనత సచిన్ తెందుల్కర్ (673 పరుగులు) పేరిట ఉంది. 2003లో 11 మ్యాచ్​లాడి 61.18 సగటుతో ఈ ఘనత సాధించాడు లిటిల్ మాస్టర్. ఇందులో ఆరు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉన్నాయి. 16 ఏళ్లుగా ఇది చెక్కుచెదరకుండా అలానే ఉంది. దీన్ని అధిగమించేందుకు ఇంగ్లాండ్​ బ్యాట్స్​మెన్ రూట్ 125 పరుగులు చేయాల్సి ఉండగా, కివీస్ కెప్టెన్ 126 పరుగులు చేస్తే ఈ రికార్డు బద్దలవుతుంది.

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్

ఈ రికార్డుకు దగ్గరగా వచ్చారు కానీ..!

రూట్, విలియమ్సన్ కాకుండా ఈ ప్రపంచకప్​లో 600కు పైగా పరుగులు ముగ్గురు బ్యాట్స్​మెన్ చేశారు. రోహిత్ శర్మ (టీమిండియా)- 648 పరుగులు, డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 647 పరుగులు, షకీబ్ అల్ హసన్ (బంగ్లాదేశ్)- 606 పరుగులు చేశారు. వీరు దగ్గర వరకు వచ్చి ఈ రికార్డును అందుకోలేకపోయారు.

టీమిండియా బ్యాట్స్​మెన్ రోహిత్ శర్మ

కివీస్​తో సెమీఫైనల్​లో భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ ఈ ఘనత అందుకుంటాడని అందరూ అనుకున్నారు. అప్పటికే ఈ ప్రపంచకప్​లో 5 సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ చేశాడు హిట్​మ్యాన్. కానీ ఈ మ్యాచ్​లో కేవలం ఒక్క పరుగుకే ఔటై పెవిలియన్​ చేరాడు.

ఈ సారి కొత్త ఛాంపియన్

ఇరుజట్లలో ఎవరూ గెలిచినా తొలిసారి ప్రపంచకప్​ను అందుకున్న జట్టుగా రికార్డు సృష్టిస్తారు. బ్యాటింగ్​తో పాటు బౌలింగ్​లోనూ ఇంగ్లాండ్ దుర్భేద్యంగా ఉంది. టోర్నీ ఆసాంతం అంచనాలకు మించి రాణిస్తూ వచ్చింది న్యూజిలాండ్. ఆదివారం 'క్రికెట్ కా మక్కా' లార్డ్స్​లో విజేత ఎవరనేది తేలనుంది.

Last Updated : Jul 13, 2019, 8:31 AM IST

ABOUT THE AUTHOR

...view details