ప్రపంచకప్ ఆరంభంలోనే తనేంటో నిరూపించాడు టీమిండియా బ్యాట్స్‌మెన్ రోహిత్ శర్మ. బుధవారం సౌతాంప్టన్ వేదికగా సఫారీలతో జరిగిన మ్యాచ్‌లో తనదైన బ్యాటింగ్‌తో కెరీర్లో 23వ శతకాన్ని సాధించాడు. భారత మాజీ సారథి సౌరవ్ దాదా చేసిన 22 సెంచరీల రికార్డును వెనక్కి నెట్టాడు రోహిత్.
దాదా రికార్డును హిట్ చేసిన రోహిత్ - రోహిత్ శర్మ సెంచరీ
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. మాజీ టీమిండియా సారథి సౌరవ్ గంగూలీని గుర్తుచేశాడు. తాజాగా దక్షిణాఫ్రికాపై తన 23వ వన్డే శతకం చేసిన ఈ హిట్‌మ్యాన్... 2019 ప్రపంచకప్‌లో తొలి సెంచరీ చేసిన ఆసియా బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించాడు.
దాదా రికార్డును హిట్ చేసిన రోహిత్
ఆరంభంలోనే ఆసియన్ అదుర్స్...
మెగాటోర్నీలో భారత్ బరిలోకి దిగిన మొదటి మ్యాచ్‌లోనే సెంచరీతో అలరించాడు. గతంలో సెహ్వగ్ (2011), కోహ్లీ (2011, 2015) ప్రపంచకప్‌లలో ఈ ఘనత సాధించారు. అంతేకాకుండా 2019 ప్రపంచకప్‌లో తొలి శతకం చేసిన ఆసియన్‌గా నిలిచాడీ హిట్‌మ్యాన్.
- 2015 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌పై శతకం బాదిన ఈ హిట్టర్... ప్రస్తుత ప్రపంచకప్‌లో రెండో సెంచరీ చేశాడు.
- వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు, 23 వన్డే శతకాలతో అత్యధిక శతకాల వీరుల జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచాడు.
- 2019 ప్రపంచకప్ టోర్నీలో ఇదివరకే ఇంగ్లండ్ ఆటగాళ్లు జాయ్ రూట్, జోస్ బట్లర్ ఒకే మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై సెంచరీలు సాధించారు.