ప్రపంచకప్‌లో వరుస శతకాలతో దూసుకుపోతున్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ మరో సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. బంగ్లాతో జరుగుతున్న మ్యాచ్‌లో 90 బంతుల్లో 100 పరుగులు పుర్తిచేశాడు. ఈ శతకంతో గంగూలీ రికార్డును బద్దలు కొట్టాడు రోహిత్ శర్మ. 2003 మెగాటోర్నీలో సౌరవ్ మూడు సెంచరీలు చేయగా.. ప్రస్తుతం 4 శతకాలతో దాదాను అధిగమించాడు రోహిత్.
ఆరంభం నుంచి ధాటిగా ఆడిన హిట్ మ్యాన్ కెరీర్లో 26వ శతకాన్ని నమోదు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 5 సిక్సర్లు ఉన్నాయి. హిట్ మ్యాన్‌కు ఇది వరుసగా రెండో శతకం. ఇంగ్లాండ్‌పైనా సెంచరీతో ఆకట్టుకున్నాడు.
ప్రపంచకప్ టోర్నీలో 15 ఇన్నింగ్స్‌లో 5 శతకాలు చేశాడు. 2015 మెగాటోర్నీలో ఒకటి.. ఈ ప్రపంచకప్‌లో 4 సెంచరీలు నమోదు చేశాడు. ఈ శతకంతో పాంటింగ్(5), సంగక్కర(5)లను సమం చేశాడు. ఇంకో శతకం చేస్తే సచిన్(6) రికార్డు అందుకుంటాడు హిట్ మ్యాన్. ఓ మెగాటోర్నీలో ఎక్కువ సెంచరీలు చేసిన రికార్డు సంగక్కర(4) పేరిట ఉంది. ఆ రికార్డునూ సమం చేశాడు రోహిత్.