2015 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ నిలవాలంటే బంగ్లాదేశ్‌పై తప్పక గెలవాల్సిన పరిస్థితి. కానీ 275 పరుగుల లక్ష్య ఛేదనలో 260 పరుగులకే ఆలౌటై మెగాటోర్నీ నుంచి నిష్క్రమించింది. అదే 2019కు వచ్చేసరికి జట్టు స్వరూపమే పూర్తిగా మారిపోయింది. కేవలం నాలుగేళ్లలో ఈ మార్పునకు కారణాలు ఏంటి? గెలిచేందుకు ఇంగ్లాండ్‌కు దోహదపడిన అంశాలేంటి?
ప్రపంచకప్ పరాభవం కసిని పెంచింది...
ఇంగ్లాండ్ జట్టులో ఐదుగురు ఆటగాళ్లకు 2015 ప్రపంచకప్‌లో ఆడిన అనుభవం ఉంది. అప్పుడూ ఆ జట్టు కెప్టెన్ మోర్గానే. అయితే 4 ఏళ్ల క్రితం జరిగిన వరల్డ్‌కప్ పరాభవం వారిలో కసిని పెంచింది. వరుస విజయాలతో దూసుకెళ్లేలా చేసింది. జట్టులో మార్పులు చేసి ప్రతిభ కలిగిన యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించింది యాజమాన్యం. ఆ మార్పే నాలుగేళ్లలో కప్పును అందుకునేలా చేసింది.
ట్రోఫీని ముద్దాడుతున్న కెప్టెన్ మోర్గాన్ స్ట్రాస్ పర్యవేక్షణలో రాటుతేలింది..
మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ పర్యవేక్షణలో ఇంగ్లాండ్ రాటుతేలింది. జట్టు డైరెక్టర్‌గా నియమాకం అయిన తర్వాత స్ట్రాస్ చేసిన మొదటి పని.. జట్టు కోచ్ పీటర్ మూర్స్, మెంటర్ కెవిన్ పీటర్సన్‌ను తొలగించాడు. కొత్త కోచ్‌గా ట్రెవర్‌ను నియమించి.. జేసన్ రాయ్, బెయిర్ స్టో, జో రూట్, బట్లర్, స్టోక్స్, వోక్స్ లాంటి యువ క్రికెటర్లకు ఎక్కువ అవకాశాలు కల్పించాడు. 44 ఏళ్ల కలను 4 ఏళ్లలో నిజం చేశాడు.
13 వన్డే సిరీస్‌ల్లో 11 విజయాలు..
2017 జనవరి నుంచి మెగాటోర్నీ ముందువరకు ఇంగ్లాండ్ 13 వన్డే సిరీస్‌లు ఆడగా కేవలం రెండింటిలోనే పరాజయం చెందింది. వెస్టిండీస్ (4-0), ఆస్ట్రేలియా (5-0), టీమిండియా (2-1), పాకిస్థాన్ (4-0) లాంటి అగ్రజట్లపై స్వదేశంలో జరిగిన వన్డే సిరీస్‌ల్లో గెలిచింది.
విదేశాల్లోనూ సత్తాచాటింది ఇంగ్లీష్ జట్టు. కంగారూ జట్టుపై 4-1, న్యూజిలాండ్‌పై 3-2, శ్రీలంకపై 3-1తో సత్తాచాటింది. ఈ సమయంలో ఇంగ్లాండ్ 39 మ్యాచ్‌ల్లో నెగ్గి 12 వన్డేల్లో ఓటమి పాలైంది. ఈ విజయాలే వన్డేల్లో ఇంగ్లాండ్‌ను అగ్రస్థానానికి వెళ్లేలా చేశాయి. ఇంగ్లాండ్ చివరగా 2017లో భారత్‌లో జరిగిన వన్డే సిరీస్‌లో ఓడిపోయింది.
ఈ వరల్డ్‌కప్‌లో పడి పడి లేచిన ఇంగ్లాండ్...
ఈ మెగాటోర్నీలో ఇంగ్లాండ్ జైత్రయాత్రను మూడు భాగాలుగా విడదీస్తే.. తొలి ఐదు మ్యాచ్‌ల్లో నాలుగింటిలో గెలిచి మెరుగైన స్థితిలో నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి మ్యాచ్‌లో నెగ్గింది. అయితే పాకిస్థాన్ చేతిలో ఓటమిపాలైంది. అనంతరం బంగ్లాదేశ్, విండీస్, అఫ్గానిస్థాన్‌పై హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది.
ప్రపంచకప్-2019లో శ్రీలంక చేతిలో ఇంగ్లాండ్ ఓటమి అనంతరం శ్రీలంక, ఆస్ట్రేలియాపై జరిగిన మ్యాచ్‌ల్లో అనూహ్య ఓటములతో వెనుకబడింది. బంగ్లా, పాకిస్థాన్ పుంజుకోగా.. టీమిండియాతో మ్యాచ్‌ను తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. భారత్‌పై నెగ్గి సెమీస్ రేసులో నిలిచింది. అనంతరం చివరి లీగ్ మ్యాచ్‌లో కివీస్‌పై గెలిచి సెమీస్ బెర్త్ ఖరారు చేసుకుంది.
సెమీస్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది ఇంగ్లాండ్. 8 వికెట్ల తేడాతో నెగ్గి తుదిపోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరిగిన ఉత్కంఠ ఫైనల్లో న్యూజిలాండ్‌పై గెలిచి ఏ ఇంగ్లీష్ జట్టు సాధించని ఘనతను సొంతం చేసుకుంది. 44 ఏళ్ల కలను సాకారం చేసుకుంది.
ఇది చదవండి: 'సూపర్' థ్రిల్లర్ మ్యాచ్‌లో విశ్వవిజేతగా ఇంగ్లాండ్