తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఇన్నింగ్స్ చివర్లో వరణుడి రాక.. కివీస్@211/5

మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న కివీస్ - భారత్​ మ్యాచ్​కు వరణుడు అడ్డుతగిలాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్లు నష్టానికి 211 పరుగులు చేసింది. విలియమ్సన్, టేలర్ అర్ధశతకాలు చేశారు. భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు.

కివీస్ - భారత్

By

Published : Jul 9, 2019, 7:16 PM IST

భారత్​తో జరుగుతున్న ప్రపంచకప్ తొలి సెమీస్ మ్యాచ్​లో న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 211 పరుగులు చేసింది. మాంచెస్టర్ వేదికగా జరుగుతున్న ఈ పోరులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది కివీస్. కేన్ విలియమ్సన్(67, 95 బంతుల్లో), రాస్ టేలర్​(67*, 85 బంతుల్లో) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్లలో భువి, బుమ్రా, చాహల్, జడేజా, పాండ్య తలో వికెట్ తీసుకున్నారు.

46 ఓవర్లు ముగిశాక వర్షం మ్యాచ్​కు అంతరాయం కలిగించింది. మ్యాచ్​ తాత్కాలికంగా ఆగిపోయింది. ప్రస్తుతం క్రీజులో రాస్ టేలర్(67), టామ్ లేథమ్(3) ఉన్నారు.

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ ఆరంభంలోనే ఓపెనర్ గప్తిల్(1) వికెట్ కోల్పోయింది. అప్పటికి జట్టు స్కోరు ఒక్క పరుగే. అనంతరం క్రీజులోకి వచ్చిన విలియమ్సన్ మరో ఓపెనర్ నికోలస్ హెన్రీ(28) సాయంతో ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరూ 68 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. నికోలస్​ను ఔట్ చేసి ఈ జోడీని విడదీశాడు జడేజా.

అనంతరం రాస్ టేలర్​తో కలిసి స్కోరు బోర్డును ముందుకు కదిలించే ప్రయత్నం చేశాడు విలియమ్సన్​. ఎప్పటిలానే ఈ జోడి వికెట్ల పడకుండా క్రీజులో పాతుకుపోయి బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. వీరిద్దరూ 65 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. వన్డేల్లో ఈ జోడీ 30వ సారి 50 పైగా పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. కివీస్​ సారథిని ఔటే చేసి ఈ ద్వయాన్ని విడదీశాడు చాహల్.

విలయమ్సన్ ఔటైనా.. రాస్ టేలర్ క్రీజులో పాతుకుపోయాడు. అయితే వేగంగా పరుగుల చేయలేకపోయాడు. జేమ్స్​ నీషమ్(12), గ్రాండ్ హోమ్(16) సాయంతో ఇన్నింగ్స్​ కాసేపు ముందుకు నడిపించాడు. నీషమ్​ను పాండ్య ఔట్ చేయగా.. గ్రాండ్​హోమ్​ను భువి పెవిలియన్ పంపాడు. ప్రస్తుతం లేథమ్​ సాయంతో జట్టుకు గౌరవప్రదమైస స్కోరు అందించే దిశగా తీసుకెళ్తున్నాడు టేలర్. ​

ఇది చదవండి: WC19: అండర్-19లో నెగ్గాడు..మరి ప్రపంచకప్​లో..!

ABOUT THE AUTHOR

...view details