లార్డ్స్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ విజయం సాధించింది. సెమీస్‌కు చేరాలంటే భారీ తేడాతో గెలవాల్సిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 94 పరుగుల తేడాతో గెలిచింది. ఇమాముల్ హక్ సెంచరీ, బాబర్ ఆజమ్ 96 పరుగులకు తోడు.. బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిది 6 వికెట్లు తీసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఓపెనర్ ఇమాముల్ హక్ సెంచరీ చేశాడు. ఆ వెంటనే హిట్ వికెట్‌గా వెనుదిరిగాడు. బాబర్ ఆజమ్ 96 పరుగులు చేసి కొద్దిలో శతకాన్ని చేజార్చుకున్నాడు.
మిగతా వారిలో ఫకర్ 13, హఫీజ్ 27, హరీశ్ సొహైల్ 6, ఇమాద్ 43, సర్ఫరాజ్ 3, వాహబ్ రియాజ్ 2, షాదాబ్ ఖాన్ 1, ఆమిర్ 8 పరుగులు చేశారు.
బంగ్లా బౌలర్లలో ముస్తాఫిజుర్ 5 వికెట్లు తీశాడు. సైఫుద్దీన్ 3, మెహదీ హాసన్ 1 వికెట్ తీశారు.
అనంతరం 316 లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ఆరంభం నుంచే తడబడింది. క్రమంగా వికెట్లు కోల్పోయింది. షకీబ్ ఒక్కడే ఉన్నంత సేపు కొంత పోరాడాడు. అతడు వెనుదిరిగిన తర్వాత మరో బ్యాట్స్‌మెన్ నిలువలేకపోయాడు.