ఉత్కంఠగా జరిగిన మ్యాచ్‌లో 14 పరుగుల తేడాతో ఆతిథ్య ఇంగ్లాండ్‌ను ఓడించింది పాకిస్థాన్. హఫీజ్ (84; 62 బంతుల్లో 8×4, 2×6), బాబర్ అజామ్ (63; 66 బంతుల్లో 4×4, 1×6), సర్ఫ్‌రాజ్ (55; 44 బంతుల్లో 5×4) మెరవడంతో మొదట పాకిస్థాన్ 8 వికెట్లకు 348 పరుగులు చేసింది. ఛేదనలో రూట్ (107; 104 బంతుల్లో 10×4, 1×6), బట్లర్ (103; 76 బంతుల్లో 9×4, 2×6) సెంచరీలు కొట్టినా.. ఇంగ్లాండ్ 9 వికెట్లకు 334 పరుగులే చేయగలిగింది. బంతితోనూ రాణించిన హఫీజ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ లభించింది.
349 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ ఆరంభంలోనే వికెట్ కోల్పోయింది. జేసన్ రాయ్ (8)ను షాదాబ్ ఖాన్ ఔట్ చేశాడు. అనంతరం బెయిర్ స్టో (32) - జో రూట్ జోడి నిలకడగా ఆడింది. వీరిద్దరూ మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు.
కుదురుకునే సమయంలోనే బెయిర్ స్టోను ఔట్ చేసి ఇంగ్లాండ్‌ను దెబ్బతీశాడు వాహబ్ రియాజ్. కాసేపటికే మోర్గాన్‌ను (9) కూడా పెవిలియన్ చేర్చాడు హఫీజ్. అనంతరం బ్యాటింగ్‌కొచ్చిన బెన్ స్టోక్స్ (13) ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. షోయబ్ మాలిక్ బౌలింగ్‌లో ఔటయ్యాడు.
బట్లర్, రూట్ శతకాలు