తెలంగాణ

telangana

ETV Bharat / sports

1992 ఫలితాలను పునరావృతం చేస్తోన్న పాక్​

1992 ప్రపంచకప్ ఫలితాలను పునరావృతం చేస్తోంది పాకిస్థాన్. ఆ మెగాటోర్నీలో మాదిరిగానే ఓటమితో ప్రారంభించి విజయాలవైపు దూసుకెళ్తోంది.

పాకిస్థాన్

By

Published : Jun 27, 2019, 5:31 AM IST

పాకిస్థాన్.. అంచనాలకు అందకుండా.. ఎప్పుడు ఎలా ఆడుతుందో తెలియదు. ఎంత పెద్ద జట్టునైనా బోల్తా కొట్టిస్తుంది. అలాగే పసికూన జట్ల ముందు చతికిలబడుతుంది. ఈ ప్రపంచకప్​లో మూడు విజయాలను నమోదు చేసిన పాక్ 1992 మెగాటోర్నీ ఫలితాలను పునరావృతం చేస్తోంది. అదే నిజమైతే కప్పు కైవసం చేసుకున్నా.. ఆశ్చర్య పోనక్కర్లేదు!

1992 వరల్డ్​కప్​ను సొంతం చేసుకున్న పాకిస్థాన్ ఓటమితో ఆ టోర్నీని ప్రారంభించిది. ప్రస్తుతం జరుగుతున్న ప్రపంచకప్​లోనూ తొలి మ్యాచ్​లో విండీస్​పై ఓడింది. 1992లో రెండో మ్యాచ్​ గెలిచిన పాక్.. ఈ టోర్నీలోనూ రెండో మ్యాచ్​లో​ విజయం సాధించింది. ఆ టోర్నీలో మూడో మ్యాచ్​ వర్షం కారణంగా రద్దవగా.. ఈ మెగాటోర్నీలోనూ శ్రీలంకతో జరగాల్సిన మ్యాచ్ వర్షార్పణమైంది. 1992లో తాను ఆడిన 4, 5 మ్యాచుల్లో ఓడిన పాకిస్థాన్.. ఇప్పుడూ వరుసగా ఆస్ట్రేలియా, భారత్ చేతిలో పరాజయం చెందింది. ఆ టోర్నీలో 6, 7 మ్యాచుల్లో గెలిచిన దాయాది జట్టు.. ప్రస్తుత ప్రపంచకప్​లోనూ దక్షిణాఫ్రికా, కివీస్​పై వరుస విజయాలను నమోదు చేసింది.

ఇప్పటికీ ఏడు మ్యాచ్​లు ఆడిన పాకిస్థాన్ మూడింటిలో నెగ్గింది. మిగతా వాటిలోనూ భారీ విజయం సాధిస్తే.. పాక్​ సెమీస్ చేరే అవకాశముంది. ఇందుకు నెట్​ రన్​రేట్​ కూడా సహకరించాలి. 1992 ఫలితాలను పునరావృతం చేస్తోన్న పాక్.. అదే సెంటిమెంటుతో కప్పు గెలవాలని అభిమానులు ఆశిస్తున్నారు.

బర్మింగ్​హామ్ వేదికగా న్యూజిలాండ్​తో జరిగిన మ్యాచ్​లో పాకిస్థాన్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాదించింది పాకిస్థాన్. బాబర్ అజామ్(101) శతకంతో ఆకట్టుకోగా.. సొహైల్(68) అర్ధశతకంతో రాణించాడు. ఈ విజయంతో సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది పాక్​

ABOUT THE AUTHOR

...view details