తెలంగాణ

telangana

ETV Bharat / sports

వైరల్​: ఈ బామ్మ... బుమ్రా అయింది..! - old lady

జస్ప్రీత్ బుమ్రాను అనుకరిస్తూ ఓ బామ్మ బౌలింగ్ చేసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్​చల్ చేస్తోంది. ఈ వీడియోకు రిప్లై కూడా ఇచ్చాడు భారత స్టార్ పేసర్.

బామ్మా బుమ్రా

By

Published : Jul 14, 2019, 4:53 PM IST

భారత స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రాను అనుకరిస్తూ బౌలింగ్ చేసిన విరాట్​ కోహ్లీని మరువక ముందే అంతర్జాలంలో మరో వీడియో హల్ చల్ చేస్తోంది. ఓ వృద్ధురాలు బుమ్రాలా బౌలింగ్ చేసింది. ఈ వీడియోను ఓ అభిమాని ట్విట్టర్లో పోస్ట్ చేసింది.

"అందరిలానే ఈమె కూడా బుమ్రా బౌలింగ్​ను ఎంతో అభిమానించింది. అందుకే అతడిని అనుకరిస్తూ బౌలింగ్ చేసింది" అని ట్వీటింది.

ప్రపంచకప్​ షెడ్యూల్​తో తలమునకలై ఉన్నప్పటికీ బుమ్రా ఈ ట్వీట్​కు రిప్లై ఇచ్చాడు. "ఈ వీడియో చూసి ఈ రోజు సంతృప్తికరంగా గడిపా" అంటూ పోస్ట్​ చేశాడు.

న్యూజిలాండ్​తో జరిగిన ప్రపంచకప్ సెమీస్​లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడడం భారత అభిమానులను కలచి వేసింది. ఎన్నో ఆశలతో బరిలో దిగిన టీమిండియా కప్పునకు అడుగు దూరంలో ఆగిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం బుమ్రా అందరికీ ధన్యవాదాలు చెప్తూ ట్వీట్ చేశాడు.

ఇది చదవండి: WC19:​ ఫైనల్​కు ముగ్గురు చిన్నారి అతిథులు!

ABOUT THE AUTHOR

...view details