ప్రపంచ్‌కప్ లాంటి మెగా టోర్నీల్లో ఆటగాళ్లు కుటుంబంతో ఉంటే.. వారి ఏకాగ్రత దెబ్బతింటుందని చాలా జట్టు యాజమాన్యాలు భావిస్తాయి. అందుకే పాకిస్థాన్‌తో పాటు ఆస్ట్రేలియా ఆటగాళ్లు కుటుంబసభ్యులకు దూరంగా ఉండాలని ఆయా జట్ల యాజమాన్యాలు ఇప్పటికే ఆదేశించాయి. కానీ న్యూజిలాండ్ కోచ్ మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తున్నాడు. తీరిక దొరికినప్పుడల్లా కుటుంబంతో సమయాన్ని గడపాలంటూ కివీస్ ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నాడు గ్యారీ స్టీడ్. ఆటగాళ్లకు ఒక మ్యాచ్ నుంచి మరో మ్యాచ్‌కు మధ్య దొరికే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడ్డాడు.
'ఆటగాళ్లూ... వారితో ఎక్కువ సమయం గడపండి' - ప్రపంచ్‌కప్
ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో ఖాళీ సమయం దొరికితే తమ జట్టు ఆటగాళ్లు కుటుంబంతో గడిపాలని ప్రోత్సహిస్తున్నాడు కివీస్ కోచ్ గ్యారీ స్టీడ్. ఆటగాళ్లకు ఒక మ్యాచ్ నుంచి మరో మ్యాచ్‌కు మధ్య దొరికే సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని అభిప్రాయపడుతున్నాడు.
ఆటగాళ్లు కుటుంబంతో గడపాలని కోచ్ ప్రోత్సాహం!
ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న ప్రపంచకప్‌లో కివీస్ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. నాలుగో మ్యాచ్ టీమిండియాతో తలపడాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దయింది. తదుపరి మ్యాచ్‌లో జూన్ 19న బర్మింగ్‌హామ్ వేదికగా దక్షిణాఫ్రికాతో తలపడనుంది బ్లాక్ క్యాప్స్.
ఇదీ చూడండి : ఆ ఇద్దరి వికెట్లపైనే పాక్ గురి : సచిన్