ప్రపంచకప్ తుది ఘట్టానికి చేరుకొంటోంది. సెమీస్‌లో నాలుగో స్థానం కోసం ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక జట్లు పోటీ పడుతున్నాయి. అయితే ఇలాంటి కీలక సమయంలో లంకకు పెద్ద దెబ్బ తగిలింది. ఆ జట్టు ఫాస్ట్ బౌలర్ నువాన్ ప్రదీప్ మెగాటోర్నీ నుంచి నిష్క్రమించాడు. చికెన్ పాక్స్ కారణంగా టోర్నీకి దూరమైనట్లు అధికారికంగా పేర్కొంది లంక జట్టు యాజమాన్యం. ఇతడి స్థానంలో కసున్ రజిత్ జట్టులో చేరనున్నాడు.
ప్రపంచకప్‌లో శ్రీలంకకు షాక్.. ప్రదీప్ ఔట్
ప్రపంచకప్ కీలక దశకు చేరుకుంది. సెమీస్‌లో చోటు కోసం ఇంగ్లాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, శ్రీలంక పోటీ పడుతున్నాయి. ఇలాంటి సమయంలో లంక జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ ప్రదీప్ టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
ప్రపంచకప్‌లో శ్రీలంకకు షాక్.. ప్రదీప్ ఔట్
7 మ్యాచ్‌లు ఆడిన శ్రీలంక.. రెండు మాత్రమే నెగ్గి మూడు మ్యాచ్‌లు ఓడింది. మరో రెండు వర్షం కారణంగా రద్దయ్యాయి. ఫలితంగా 6 పాయింట్లతో 7వ స్థానంలో ఉంది. చివరి రెండు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్, భారత్‌తో తలపడనున్న ఈ జట్టు... రెండింటిలోనూ గెలిస్తే సెమీస్‌లో నాలుగో స్థానం కోసం రేస్‌లో ఉంటుంది.