తెలంగాణ

telangana

ETV Bharat / sports

'విశ్వవిజేతగా నిలిచినా.. ఎక్కడో చిన్న అసంతృప్తి' - worldcup

ప్రపంచకప్ ఫైనల్లో విజేతను నిర్ణయించిన విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్.   ఫలితం సరైన తీరులో లేదని అభిప్రాయపడ్డాడు. అయితే తాము విజేతలవడానికి అర్హులమేనన్నాడు.

మోర్గాన్

By

Published : Jul 21, 2019, 3:05 PM IST

ప్రపంచకప్ ముగిసిన వారం తర్వాత ఫైనల్​ ఫలితంపై ఇంగ్లాండ్ కెప్టెన్ మోర్గాన్ స్పందించాడు. న్యూజిలాండ్​తో జరిగిన ఫైనల్లో గెలవడం ఆనందంగా ఉన్నా.. విజేతను నిర్ణయించిన విధానం సరిగా లేదన్నాడు. ఉత్కంఠగా సాగిన పోరులో ఈ టైటిల్​కు అర్హులమైనా.. స్వల్ప తేడాతో విశ్వ విజేతగా నిలవడం వల్ల సంతోషాన్ని పూర్తిగా ఆస్వాదించలేకపోతున్నానని అభిప్రాయపడ్డాడు.

ఈ గెలుపు అంత సులభంగా రాలేదు. విజేతను నిర్ణయించిన తీరు సరిగా లేదు. విజయం మాకు అనుకూలంగా వచ్చింది. ప్రతికూలంగా వచ్చుంటే.. అనే ఆలోచనే భయంకరంగా ఉంది. -ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ కెప్టెన్

ఒక్క సంఘటనే మ్యాచ్​ ఫలితం మార్చిందని తాను అనుకోవట్లేదని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు.

ఒక్క సంఘటనే (గప్తిల్ ఓవర్​ త్రోలో వచ్చిన ఆరు పరుగులు గురించి) మ్యాచ్​ ఫలితం తారుమారు చేసిందని అనుకోవట్లేదు. మేమూ కష్టపడ్డాం.. ఈ విజయానికి అర్హులమే. -ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ కెప్టెన్

ఫైనల్​ తర్వాత న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్స్​తో చాలా సార్లు మాట్లాడనని మోర్గాన్ చెప్పాడు.

మ్యాచ్​ అయిన తర్వాత కేన్​తో చాలా సార్లు మాట్లాడాను. ఫలితంపై ఇద్దరం చర్చించుకున్నాం. ఫైనల్ మ్యాచ్​ కొన్నిసార్లు మా వైపు మళ్లింది.. కొన్ని సార్లు వాళ్లకు అనుకూలంగా మారింది. నా లాగే కేన్​ కూడా ఇవన్నీ పట్టించుకోలేదని అనుకుంటున్నా. -ఇయాన్ మోర్గాన్, ఇంగ్లాండ్ కెప్టెన్

న్యూజిలాండ్​తో జరిగిన తుదిపోరులో ఇంగ్లాండ్​ ప్రపంచకప్​ సొంతం చేసుకుంది. బౌండరీ కౌంట్ ద్వారా ఇంగ్లీష్ జట్టు తొలిసారి విశ్వవిజేతగా నిలిచింది.

ఇది చదవండి: వెస్టిండీస్ పర్యటనలో భారత జట్టు ప్రకటన

ABOUT THE AUTHOR

...view details