భారత్‌పై సిరీస్ గెలుపు బాకీ పడి ఉన్నామని, ప్రపంచకప్‌లో గెలిచి సమం చేస్తామని దక్షిణాఫ్రికా ఫాస్ట్‌బౌలర్ లుంగి ఎంగిడి అన్నాడు. గతేడాది వన్డే సిరీస్‌ను 5-1 తేడాతో భారత్ కైవసం చేసుకుందని చెప్పాడీ 23 ఏళ్ల పేసర్.
'ప్రపంచకప్‌లో భారత్‌పై గెలిచి బాకీ తీర్చుకుంటాం ' - worldcup
వచ్చే ప్రపంచకప్‌లో భారత్‌పై గెలిచి సత్తా చాటుతామని దక్షిణాఫ్రికా పేసర్ లుంగి ఎంగిడి అన్నాడు. టీమిండియాపై ఓ సిరీస్ గెలుపు బాకీ పడి ఉన్నామని చెప్పాడీ 23 ఏళ్ల ఫాస్ట్ బౌలర్.
"గతేడాది దక్షిణాఫ్రికా పర్యటనకుభారత్వచ్చినపుడు మా జట్టులో కొంతమంది కీలక ఆటగాళ్లు లేరు. వారితో ఓ సిరీస్ గెలుపు బాకీ పడి ఉన్నాం. వచ్చే ప్రపంచకప్‌లో పూర్తి జట్టుతో భారత్‌పై సత్తా చాటుతాం. ప్రస్తుతం టీమిండియా బలంగా ఉంది. జూన్ 5న భారత్‌తో మ్యాచ్ ఆసక్తికరంగా జరుగనుంది". -లుంగి ఎంగిడి, దక్షిణాఫ్రికా పేసర్
సౌతాఫ్రికా ఒక్కసారి కూడా ప్రపంచకప్ గెలవలేకపోయిందని, ఈ సారి మా కల నెరవేరబోతోందని జోస్యం చెప్పాడు ఎంగిడి. 21.64 సగటుతో 34 వన్డే వికెట్లు తీసిన ఈ పేసర్ వరల్డ్‌కప్ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని చెప్పాడు. మే 30 నుంచి ఇంగ్లండ్ వేదికగా ప్రపంచకప్ జరుగనుంది.