తెలంగాణ

telangana

ETV Bharat / sports

బీసీసీఐ రూల్​​: 'ఆటగాళ్లతో పాటు కోచ్​కూ ఫిట్​నెస్​' - rohit sharma

టీమిండియా ప్రధాన కోచ్‌, సహాయక బృందానికి బీసీసీఐ దరఖాస్తులు ఆహ్వానించింది. కొత్తగా విడుదల చేసిన నోటిఫికేషన్​లో వయసు, అనుభవం నిబంధనలు విధించింది. అభ్యర్థులకు కనీసం రెండేళ్లు అంతర్జాతీయ అనుభవం ఉండాలని, వయసు 60 ఏళ్లకు మించరాదని స్పష్టం చేసింది.

బీసీసీఐ రూల్​​: 'ఆటగాళ్లతో పాటు కోచ్​కూ ఫిట్​నెస్​'

By

Published : Jul 16, 2019, 9:41 PM IST

భారత జాతీయ క్రికెట్​ జట్టుకు ప్రధాన కోచ్‌, సహాయక బృందం దరఖాస్తుల కోసం బీసీసీఐ మంగళవారం నోటిఫికేషన్​ జారీ చేసింది. కొత్తగా విడుదల చేసిన నోటిఫికేషన్​ నిబంధనల్లో వయసు, అనుభవం వంటి వివరాలు చేర్చింది. అభ్యర్థులకు కనీసం రెండేళ్ల అంతర్జాతీయ అనుభవంతో పాటు వయసు 60 సంవత్సరాలు దాటరాదని సూచించింది.

ప్రధాన కోచ్‌ సహా బ్యాటింగ్‌, ఫీల్డింగ్‌, బౌలింగ్‌, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌లు, ఫిజియో థెరపిస్ట్​, అడ్మినిస్ట్రేటివ్‌ మేనేజర్‌ పదవులకు నియామకాలు చేపట్టనుంది భారత క్రికెట్​ బోర్డు. జులై 30 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తులు అందజేయాలని సూచించింది.

" ప్రస్తుతం టీమిండియాకు కొనసాగుతున్న కోచింగ్‌ బృందానికి నియామకాల ప్రక్రియలో దరఖాస్తు చేసుకోకుండానే ప్రవేశం ఉంటుంది"

-- బీసీసీఐ ప్రకటన

రవిశాస్త్రిని నియమించక ముందు 2017 జులైలో కోచ్‌ల ఎంపికకు బీసీసీఐ తొమ్మిది మార్గదర్శకాలు నిర్దేశించింది. ఆ తర్వాత వాటిపై దృష్టి పెట్టలేదు. అంతేకాకుండా స్పష్టతనూ ఇవ్వలేదు. ఈసారి మాత్రం అన్ని పదవులకు కేవలం మూడు మార్గదర్శకాలనే నిర్దేశించారు.

అర్హతలు...

  1. ప్రధాన కోచ్‌ అభ్యర్థికి టెస్టు హోదా కలిగిన దేశానికి కనీసం రెండేళ్లు లేదా అసోసియేట్‌ సభ్యదేశం/ ఏ-జట్టు/ఐపీఎల్‌ జట్టుకు మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. అలాగే.. కనీసం 30 టెస్టులు లేదా 50 వన్డేలు ఆడిన అనుభవం అవసరం.
  2. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ కోచ్‌లూ టెస్టు హోదా కలిగిన దేశానికి కనీసం రెండేళ్లు లేదా అసోసియేట్‌ సభ్యదేశం/ ఏ-జట్టు/ఐపీఎల్‌ జట్టుకు మూడేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. 10 టెస్టులు లేదా 25 వన్డేలు ఆడిన అనుభవం ఉండాలి. వయసు 60 దాటకూడదు.

ప్రస్తుత ప్రధాన కోచ్‌ రవిశాస్త్రి, బౌలింగ్‌ కోచ్‌ భరత్‌ అరుణ్‌, బ్యాటింగ్‌ కోచ్‌ సంజయ్‌ బంగర్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌.శ్రీధర్‌కు ప్రపంచకప్‌ ముగిసే నాటికి పదవీకాలం ముగిసింది. అయితే వెస్టిండీస్‌ పర్యటనను (ఆగస్ట్​ 3 నుంచి సెప్టెంబర్​ 3) దృష్టిలో పెట్టుకొని బీసీసీఐ 45 రోజుల గడువు పెంచింది. ఈ ముగ్గురూ తిరిగి సహాయక బృందంలో చేరే అవకాశం ఉంది. అయితే ఫిజియో ప్యాట్రిక్‌ ఫర్హాత్​, స్ట్రెంగ్త్‌ అండ్‌ కండీషనింగ్‌ కోచ్‌ శంకర్‌ బసు వెళ్లిపోవడం వల్ల కొత్తవారికి ఛాన్స్​ లభించే అవకాశం ఉంది. ప్రస్తుతం రవిశాస్త్రి వయసు 57 ఏళ్లు. మళ్లీ ఆయనకే ప్రధాన కోచ్​ బాధ్యతలు అప్పగిస్తే... 2023 ప్రపంచకప్‌ వరకు కొనసాగిస్తారా లేదా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది.

టీమిండియా ప్రధాన కోచ్​ రవిశాస్త్రి
  • ఒకే ఒక్కటి...

2017లో కోచ్​గాఅనిల్​ కుంబ్లే​ పదవీకాలం ముగిశాక బాధ్యతలు చేపట్టాడు రవిశాస్త్రి. 2014 ఆగస్టు​ నుంచి 2016 జూన్ వరకు భారత క్రికెట్​ బోర్డు డైరెక్టర్​గానూ పనిచేశాడు. ఇతడి పర్యవేక్షణలో టీమిండియా ఒక్క ఐసీసీ టోర్నీ గెలవలేదు. గతేడాది ఆస్ట్రేలియాపై టెస్టు సిరీస్​ విజయమే కాస్త చెప్పుకోదగ్గది.

వెస్టిండీస్​ పర్యటన తర్వాత సెప్టెంబర్​ 15 నుంచి దక్షిణాఫ్రికాతో స్వదేశంలో మ్యాచ్​లు ఆడనుంది టీమిండియా.

ABOUT THE AUTHOR

...view details