తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రపంచకప్​లో న్యూజిలాండ్ చెత్త రికార్డు​ - విలియమ్సన్

ప్రపంచకప్​లో భారత్​తో సెమీఫైనల్​ మ్యాచ్​లో న్యూజిలాండ్​.. పవర్​ప్లేలో కేవలం 27 పరుగులే చేసింది. ఈ సీజన్​లో తక్కువ పరుగులు చేసిన జట్టుగా నిలిచింది.

ప్రపంచకప్​లో న్యూజిలాండ్ చెత్త రికార్డు​

By

Published : Jul 9, 2019, 4:50 PM IST

ఓల్డ్​ ట్రాఫోర్డ్​ వేదికగా టీమిండియాతో మ్యాచ్​లో న్యూజిలాండ్​ చెత్త రికార్డు నమోదు చేసింది. ఈ ప్రపంచకప్​లో పవర్​ప్లేలో అత్యంత తక్కువ స్కోరు చేసిన జట్టుగా నిలిచింది. 10 ఓవర్లలో వికెట్​ నష్టానికి కేవలం 27 పరుగులే చేసింది.

తర్వాతి స్థానాల్లో టీమిండియా 28/1, వెస్టిండీస్​ 29/2, న్యూజిలాండ్ 30/2, న్యూజిలాండ్​ 31/1 ఉన్నాయి.

ఇది తొలి సెమీఫైనల్​. గురువారం ఆస్ట్రేలియా- ఇంగ్లాండ్​ మధ్య మరో సెమీఫైనల్​ మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిచిన జట్లు ఆదివారం లార్డ్స్ వేదికగా జరిగే ఫైనల్​లో తలపడనున్నాయి.

ఇది చదవండి: ప్రపంచకప్​ సెమీఫైనల్​: భారత్​- న్యూజిలాండ్ లైవ్ పేజీ

ABOUT THE AUTHOR

...view details