తెలంగాణ

telangana

ETV Bharat / sports

WC19: టాస్ గెలిచిన కివీస్.. బంగ్లా బ్యాటింగ్​ - బంగ్లా

లండన్ ఓవల్ వేదికగా బంగ్లాదేశ్​తో జరుగుతున్న మ్యాచ్​లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. జట్టులో ఏ మార్పు లేకుండానే ఇరు జట్లు బరిలో దిగుతున్నాయి.

ప్రపంచకప్​లో న్యూజిలాండ్​తో బంగ్లా ఢీ

By

Published : Jun 5, 2019, 5:42 PM IST

Updated : Jun 5, 2019, 7:44 PM IST

బంగ్లాదేశ్​తో జరుగుతున్న ప్రపంచకప్​ తొమ్మిదో మ్యాచ్​లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. లండన్ ఓవల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్​లో పిచ్ బ్యాటింగ్​కు అనుకూలించే అవకాశముంది.

ఈ సీజన్​లో ఇరు జట్లు చెరో మ్యాచ్​ గెలిచి జోరు మీదున్నాయి. న్యూజిలాండ్ శ్రీలంకపై విజయం సాధించగా.. దక్షిణాఫ్రికాను ఓడించింది బంగ్లాదేశ్. మెగాటోర్నీల్లో ఇప్పటివరకు ఇరుజట్లు ముఖాముఖీ నాలుగు సార్లు తలపడగా... అన్ని సార్లు కివీస్ జట్టే విజయం సాధించింది.

జట్టులో ఏ మార్పుల్లేకుండానే బరిలో దిగుతున్నాయి ఇరు జట్లు.

జట్లు

బంగ్లాదేశ్..

మోర్తాజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్యా సర్కార్, షకీబ్ అల్ హసన్, ముష్ఫీకర్ రహీమ్​, మొహమ్మద్ మిథున్, మొహమ్మదుల్లా, హొస్సేన్, మెహదీ హసన్, సైఫుద్దీన్, ముస్తాఫీజర్ రెహమాన్.

న్యూజిలాండ్..

విలియమ్సన్(కెప్టెన్), మార్టిన్ గప్తిల్, కొలిన్ మున్రో, రాస్ టేలర్, టామ్ లాథమ్, నీషమ్, గ్రాండ్​హోమ్​, మిషెల్ సాంట్నర్, మ్యాట్ హెన్రీ, ఫెర్గ్యూసన్, ట్రెంట్ బౌల్ట్​.

Last Updated : Jun 5, 2019, 7:44 PM IST

ABOUT THE AUTHOR

...view details