తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోని... వన్డేలు వీడి టెస్ట్​ మ్యాచ్​లకు వచ్చెయ్​​' - batting

ఇంగ్లాండ్​తో మ్యాచ్​లో ధోని ప్రదర్శన పట్ల అసంతృప్తి చెందిన నెటిజన్లు సామాజిక మాధ్యమాల్లో మండిపడుతున్నారు. చివర్లో బౌండరీ కొట్టేందుకు ప్రయత్నించకుండా సింగిల్స్ తీసినందుకు అంతర్జాలంలో చురకలు అంటిస్తున్నారు.

ధోనీ

By

Published : Jul 1, 2019, 5:38 AM IST

Updated : Jul 1, 2019, 7:11 AM IST

ప్రపంచకప్​ మ్యాచు​ల్లో మహీంద్రసింగ్​ ధోని నిదానమైన ఆటను మాజీలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా నెటిజన్లు కూడా మహీ ఆటతీరు పట్ల మండిపడుతున్నారు. ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో చివర్లో బౌండరీ కొట్టకుండా సింగిల్స్ తీయడంపై అంతర్జాలంలో మిస్టర్ కూల్​కు చురకలు అంటిస్తున్నారు.

"వన్డేలకు రిటైర్మైంట్ ఇచ్చి టెస్ట్​ క్రికెట్​కు మళ్లీ వచ్చేయ్. టెస్ట్ ఫార్మాట్​లో నీ అవసరం చాలా ఉంది" అంటూ ఒకరు ట్వీట్ చేశారు. "ప్రపంచకప్​లో పాకిస్థాన్ సెమీస్ అవకాశాలను దెబ్బతీసి ధోని ఉత్తమ ఫినిషర్ అనిపించుకున్నాడు" అంటూ మరొకరు కామెంట్ పెట్టారు.

అయితే తొలి పది ఓవర్లలో వికెట్ నష్టానికి 28 పరుగులే చేసింది టీమిండియా. మొదట్లో వేగంగా పరుగులు రాబట్టలేక చివర్లో ధోనిని తప్పుపడుతున్నారంటూ మహీ అభిమానులు కౌంటర్ వేస్తున్నారు.

బర్మింగ్​హామ్ వేదికగా ఇంగ్లాండ్​తో జరిగిన మ్యాచ్​లో భారత్ 31 పరుగులు తేడాతో ఓడిపోయింది. ఇంగ్లీష్ బ్యాట్స్​మన్ బెయిర్ స్టో(111) శతకంతో రెచ్చిపోగా.. జేసన్ రాయ్(66), స్టోక్స్​(79) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. భారత బౌలర్ షమీ 5 వికెట్లు తీశాడు.

Last Updated : Jul 1, 2019, 7:11 AM IST

ABOUT THE AUTHOR

...view details